భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సినిమా సక్సెస్ కారణం ఆయనే..?

Divya
మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం భర్తమహాశయులకు విజ్ఞప్తి. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ నటించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మీట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ తిరుమల కిషోర్ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.


డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి తమ సినిమాని విడుదల చేయాలని ముందుగానే ప్లాన్ చేసాము. సినిమా బిగినింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని మొదలు పెట్టామని, మేము అనుకున్నట్టుగానే 100% రీచ్ అయ్యామని తెలిపారు. సినిమా చూసిన ఆడియన్స్ సైతం నాన్ స్టాప్ గా థియేటర్లో నవ్వుతున్నారు. ముఖ్యంగా సత్య గారు, వెన్నెల కిషోర్ ,సునీల్ గారు అన్ని పాత్రలలో అద్భుతంగా నటించారని, ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ డబ్బులు హ్యాపీ అయ్యారని ఈ విషయం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.


సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అయిందంటే అందుకు ముఖ్య కారణం బీమ్స్ కి వెళ్తుంది.. కార్తీకదీపం, పిన్ని డీజే మిక్స్ సాంగ్ కి అందరూ మురిసిపోయారు ముఖ్యంగా ఆషికా, డింపుల్ హయాతి ఇమేజ్ ని ఈ సినిమా బ్రేక్ చేసే క్యారెక్టర్ గా మారిందని తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ లో పవన్ తనకు హెల్ప్ చేశారని ఈ సినిమా టైటిల్ కూడా ఇచ్చింది తనే చాలా మంచి టీమ్ తో పనిచేశాము. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ తెలిపారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల. రవితేజ గారు సుమారుగా 10 ఏళ్ల నుంచి పరిచయం ఎప్పటినుంచో కలిసి సినిమా చేయాలనుకున్న లక్కీగా ఇప్పుడు కుదిరింది. స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం కూడా రవితేజ గారే ఆయనకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: