చంద్రబాబుతో ఆ మీడియా మొఘల్‌ స్నేహం వెనుక?

చంద్రబాబును గెలిపించడానికి టీడీపీకి మద్దతు తెలిపేలా వార్తలు ప్రచురించడంలో టెలికాస్ట్ చేయడంలో ఏబీఎన్  రాధాకృష్ణ పరితపిస్తుంటారని ప్రజలు ఎప్పుడూ అనుకుంటుంటారు. ఎందుకు ఇంతగా తపన పడతారో తెలియడం లేదు. కాంగ్రెస్ కు ఎలాగో ఏపీలో అవకాశం లేదు. మోడీ అంటే పడదు. కాబట్టి ఎలాగైన చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగుంటుందని ఆర్ కె నమ్ముతారు.

దీనికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు అసెంబ్లీ లో లైవ్ ను ఏబీఎన్ ఛానల్ కు ఎలాంటి టెండర్ లేకుండా ఇచ్చారు. తక్కువ ధరలకు వివిధ ఛానళ్లు లైవ్ టెలికాస్ట్ చేసే అవకాశం ఉన్నా ఇవ్వలేదు. ఎంత బిల్లు వేస్తే అంత బిల్లును బాబు చెల్లించారు. ఇలా 5 సంవత్సరాలు ఇలాగే అవకాశం ఇచ్చారు.

అడ్వర్టజ్ మెంట్ లో ఎక్కువ లబ్ధి పొందారు. స్థలాలను లీజుకు తీసుకోగలిగారు. ఇలా చాలా రకాలుగా చంద్రబాబు నుంచి ఆర్ కె లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ లబ్ధి చేకూరింది. అయితే చంద్రబాబును అధికారంలోకి ఎలాగైన తేవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్ కె.  చంద్రబాబు గెలవకపోతే ఏపీ ఏమైపోతుందో ననే భయం కలిగేలా లైవ్ లు పెట్టడం, ఆయన వస్తేనే ఏమైనా మారుతుందనే భావన ప్రజల్లో కలిగించడం ఇలాంటివి చేస్తున్నారు.

ఇలా గుడ్డిగా సమర్థించడం అలవాటు చేసుకున్నారు. చాలా టీవీ ఛానళ్లు ఆర్ కె ను ఫాలో అవుతున్నాయి. చంద్రబాబును సమర్థిస్తూ జగన్ ను తిడుతూ వార్తలు రాయడంలో లైవ్ షో లు వేయడంలో ముందంజలో వస్తున్నారు. అసలు చంద్రబాబను పొగడడం వెనక తమ లాభం ఉందని చాలా మందికి తెలియదు. కానీ అసెంబ్లీ లైవ్ లో ఎలాంటి టెండర్ లేకుండా ఫ్రీగా అనుమతి ఇవ్వడం అంటే అది అయిదేళ్లకు లాభం చేకూరినట్లే కదా అని విమర్శకులు చెబుతున్న విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

abn

సంబంధిత వార్తలు: