పాకిస్తాన్‌ అల్లకల్లోలం వెనుక మోదీ ఉన్నారా?

పాక్ లో అనేక హిందు ఆలయాలు గతంలో కూలగొట్టారు. ధ్వంసం చేశారు. ఎన్నో హిందు దేవాలయాలు దాడులకు గురయ్యాయి. ఎంతో మంది హిందువులు మతం మార్చుకున్నారు. చాలా మంది వలస వెళ్లిపోయారు. ఎంతో మంది చనిపోయారు. వీటిపై ఏ పాకిస్థాన్ నాయకుడు, గల్ప్ దేశాల నాయకులు ఇప్పటి వరకు మాట్లాడిన సందర్భాలు లేవు.

కానీ ఈ మధ్య పశ్చిమ బెంగాల్ , బిహార్ లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి జరిగింది. ఇండియాలో రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. శోభాయాత్రలను అడ్డుకుంటున్నారు. అయినా సరే వేరే వర్గంపై దాడులు జరిగిపోతున్నాయని కుహన లౌకికవాదులు, ఇతర దేశాల్లో ని కొన్ని మీడియా సంస్థలు, గల్ప్ దేశాల వారు, పాక్ లోని కొందరు విపరీతమైన ప్రచారం చేస్తుంటారు. దాడి జరిగింది ఒకరిపై అయితే మరో వర్గం వారిపై దాడులు జరిగిపోయాయంటూ తెగ బాధపడిపోతారన్న విమర్శలు ఉన్నాయి.
 
ప్రస్తుతం పాకిస్థాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. దీంతో పాకిస్థాన్ లో అల్లర్లు జరుగుతున్నాయి. దీని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. ఇలా పాక్ ఇప్పుడు రణరంగంగా మారింది. షెహర్ షెర్వారీ అనే పాక్ నటి సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు.

పాక్ లో దాడుల వెనక భారత ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. అలాగే ఇండియాకు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ పాత్ర ఉందని తీవ్ర విమర్శలు చేస్తోంది. పాక్ లో షాబాద్ షరీప్, ఇమ్రాన్ ఖాన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే నిప్పు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాక్ లో భారత ప్రధాని దాడులు చేయిస్తున్నారడం హస్యాస్పదం లా కనిపిస్తోంది. పాక్ లో గొడవలకు కారణం ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనేది అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: