అక్కడ అనంత సంపద.. కొల్లగొట్టేందుకు రష్యా, చైనా ప్లాన్‌?

ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో విలువైన ఖనిజ సంపద ఉందని అందరికీ తెలిసిందే.  అది పూర్తిగా మంచు ఖండం. మంచు పర్వతాల కింద విలువైన ఖనిజ సంపదతో పాటు పెట్రోల్, డిజీల్, వజ్ర వైడుర్యాలకు చెందిన వివిధ రకాల ఖనిజాలు ఉన్నట్లు రష్యా గతంలోనే గుర్తించింది.  దీనిపైనే అమెరికా, యూరప్ దేశాలు కూడా పరిశోధనలు చేస్తున్నాయి.

అయితే రష్యా గతంలోనే ఆ ప్రాంతానికి తన సైన్యాన్ని పంపి వివిధ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉంటోంది.  ప్రస్తుతం రష్యా, చైనాతో ఆర్కిటిక్ కు సంబంధించి ఒప్పందం చేసుకున్నాయి. ఆర్కిటిక్ అనే మంచు ఖండం లో ఆధిపత్యం ఇక రష్యా, చైనా మాత్రమే ఉండాలని భావిస్తున్నాయి. గతంలో అమెరికా, రష్యా, డెన్మాార్క్, కెనడా, నార్వే, ఫిన్లాండ్, ఐస్ లాండ్ దేశాలు ఆర్కిటిక్ 7 దేశాలుగా ఉన్నాయి.  

కొత్తగా చైనాను రష్యా అందులో కలుపుకోవాలని అనుకుంటోంది. తద్వారా ఆ ప్రాంతంలో కూడా ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకుంది. దీని ముఖ్య సందేశం ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం ఉండకూడదు. ఇకపై రష్యా, చైనా లు మాత్రమే ఈ భూమి మీద ఉన్న ఖండంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి.

ఈ మంచు ఖండం ప్రాంతంలో దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల సంపద అక్కడ ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. దీని వల్ల ప్రపంచంలోనే ఎక్కువ సంపద కలిగిన ప్రాంతంగా దానికి గుర్తింపు ఉంది. కానీ వాటిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నాలు చాలా కఠినమైనవి. ఆర్కిటిక్ కౌన్సిల్ లో రష్యా శాశ్వత దేశం కూడా కాదు. అమెరికా నాయకత్వంలోనే అది ఇన్ని రోజులు పని చేసేది. అలాంటిది ఏకంగా రష్యా, చైనాను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. రష్యా, చైనా రెండు దేశాలు కలిసి ప్రస్తుతం ఉన్న దానిలో పెత్తనం చెలాయించేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి. మరి అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: