కేసీఆర్‌.. ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రస్థాయిలో, తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్,  జాతీయ స్థాయిలో  భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కి కూడా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చూస్తే, ఆయన మాటే ఆయనది తప్ప ఇక ఎవరు చెప్పిన మాటా ఆయన వినాలనుకునే ఆలోచనలో  లేరు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే తినడానికి బియ్యం, పప్పులు లేక జనాలు పిజ్జాలు, బర్గర్లు తింటున్నారని ఆయనకి ఎవరో చెప్పారని తెలుస్తుంది.

ఎందుకంటే తాజాగా మహారాష్ట్రలో కేసీఆర్ గారు మాట్లాడుతూ దేశంలో 83కోట్ల సాగు ఎకరాల్లో, 41 కోట్ల ఎకరాలు మాత్రమే సాగు యోగ్యమైనవనీ, కానీ ప్రతి ఎకరానికి నీరు అందించకపోవడం వల్ల పిజ్జాలు, బర్గర్లు తినే దౌర్భాగ్యం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఎకరానికి నీరు అందించడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. కానీ కొంతమంది ఆల్రెడీ ప్రతి ఎకరానికి నీరు అందించడం కోసమే కదా ప్రధాన నరేంద్ర మోడీ నదుల అనుసంధానం చేసింది  అని అంటున్నారు.

కానీ పక్క రాష్ట్రానికి నీరు అందనివ్వకుండా చేస్తున్నది ఎవరు? పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతూ, గోదావరి నది జలాలను కూడా ఇది చేస్తుంది ఎవరు కెసిఆర్  కాదా అని అంటున్నారు. అంటే పక్క రాష్ట్రం మాత్రం తన వల్ల కరువుతో బాధపడాలి తాను మాత్రం మరో రాష్ట్రం వెళ్లి  ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారా అని అడుగుతున్నారు.

ఇంకో పాయింట్ ఏంటంటే పిజ్జాలు, బర్గర్లు తినేది బియ్యం లేక కాదని బియ్యం కేంద్ర ప్రభుత్వం 85 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న విషయం మర్చిపోకూడదని వాళ్ళు అంటున్నారు. పిజ్జాల రేటు మినిమం 200 ఉంటుంది. మరి బియ్యం అయితే ఒక కేజీ 50రూపాయలలో వచ్చేస్తుంది. అదే బర్గర్లు అయితే ఒక్కోటి 80-100 రూపాయల వరకు ఉంటుంది. మరి కెసిఆర్ గారు ఎందుకలా పోల్చారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: