షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు చేస్తున్న ఎన్ కౌంటర్ లు బాగానే పని చేస్తున్నాయి.  ప్రభుత్వమే ఎన్ కౌంటర్లు చేసినట్లు గతంలో ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అప్పటి నుంచి యోగి సర్కారు అంటేనే గ్యాంగ్ స్టర్లు, రౌడీ షీటర్లు భయపడిపోతున్నారు. పారిపోయి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దాక్కుంటున్నారు. పెద్ద గ్యాంగ్ స్టర్లను ఎన్ కౌంటర్ చేసే సరికి యూపీలో క్రైం రేట్ చాలా తగ్గింది. కిడ్నాప్, రేప్ కేసులు తగ్గిపోయాయి. కిడ్నాప్ లో జాతీయ సగటు 7 శాతంగా ఉంటే యూపీలో 6.3 శాతంగా మారింది. 2016-17 లో యూపీలో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం యోగి పనితీరుకు నిదర్శనం.

అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.  2016 లో ప్రతి లక్ష మంది జనాభాలో ఇటువంటి కేసులు సగటున 30 నమోదైతే 2021 నాటికి 22 కు చేరింది. వ్యవస్థీ కృత నేరాలను అణిచివేసేందుకు యూపీ సర్కారు బాగానే కృషి చేస్తున్న అదుపులోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ జరుగుతున్నాయి. తుపాకీ వినియోగించి చేసే నేరాలు 2017 తర్వాత  కూడా నిలకడగా ఉండటం కాస్త ఆందోళనకు గురి చేసే అంశం.

యూపీలో ప్రతి లక్ష మంది జనాభాలో తుపాకీ వాడే వారి సంఖ్య దాదాపు 15 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ అపీషియల్ గా తుపాకీలను వాడే సంస్కృతిని  తరిమివేసేందుకు యోగి సర్కారు ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ని రోజులుగా విచ్చలవిడిగా నేరాలు చేసి రౌడీ యిజం చేసి దోపిడీలు, దొమ్మిలు చేసిన వారికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా యోగి ఆదిత్యనాథ్ సర్కారు దాడులు చేస్తోంది.  ఉత్తరప్రదేశ్ ప్రజల జీవితాలు మారాలి. రౌడీయిజం పోయి ఉపాధి మార్గాలు దొరికి,  అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోయేలా యోగి సర్కారు మరింత, మెరుగ్గా  కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: