ఆ బీజేపీ నేతల హత్యల కోసం ముస్లిం సంస్థ కుట్రలు?

ఉత్తరాదికి పరిచయం అయిన మత రాక్షసత్వం కర్ణాటకకు పాకింది. కేరళ , బెంగాల్ లాంటి చోట్ల ఉన్న పాఫులర్ ప్రంట్ ఆప్ ఇండియా (పీపీఐ) దక్షిణాదిలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని హింస చేయడానికి ప్లాన్ చేస్తోంది. ముస్లిం యువతను పక్క దోవ పట్టించి అరాచకాలు చేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీజేపీ లో ముందు నుంచి ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలతో పని చేస్తున్న ఎమ్మెల్యేలను ఈ సంస్థ టార్గెట్ చేసింది.

ముందు నుంచి బీజేపీ లో ఉన్న కే.యస్ ఈశ్వరప్ప కర్ణాటక లో సీనియర్ లీడర్, ఎమ్మెల్యే. ఈయనను అక్కడి అభిమానులు, నాయకులు కట్టర్ హిందూ అని పిలుస్తుంటారు. ఈయన హత్యకు పీపీఐ ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.  జయేశ్ పూజారి అనే గ్యాంగ్ స్టర్ కు పీపీఐ సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులు అనుమానం వచ్చి వీరి కదలికలను గమనిస్తే కే.యస్ ఈశ్వరప్ప మర్డర్ కు ప్లాన్ చేసినట్లు తేలింది. జయేశ్ సుపారీతో పాటు మరో 12 మంది కలిసి ఈశ్వరప్పను చంపాలని చేసిన ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో అసేంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడిని చంపితే తర్వాత ఇతర నాయకులను కూడా భయపెట్టవచ్చని పీపీఐ భావించింది.

అయితే కేరళ, బెంగాల్ లో ఇలాంటి దాడులు చేసి చాలా మందిని ఈ సంస్థ భయపెట్టినట్లు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ లీడర్లను టార్గెట్ చేస్తూ హిందువులపై దాడులు చేసే విధంగా ముస్లిం యువతను ఈ సంస్థ రెచ్చగొడుతోంది. అలాగే ఈశ్వరప్ప హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. పోలీసులు చాకచక్యంగా వ్యహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: