ఇండియాకు వ్యతిరేకంగా కెనడా కుట్ర..?

కెనడాకు చెక్ పెట్టే సమయం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే కెనడా చేస్తున్న ఓవరాక్షన్ ని బట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా అయితే మనవాళ్లకు అమెరికా వీసాలు దొరక్క కెనడా బాట పడుతున్నారు ఇప్పుడు. కెనడాలో ఏడాదికి ఒక ఐదు లక్షల మందిని పెట్టుకోవాలి, కొత్త వాళ్లని రప్పించాలని వాళ్లు ఒక ప్లానింగ్ పెట్టుకునేసరికి మన వాళ్ళు చదువు పేరుతో నో, ఉద్యోగాల పేరుతోనో మనవాళ్లు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు.

ఆల్రెడీ  మనకు సంబంధించిన ఒక తరం వాళ్లు, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అది ఒక ఎత్తు అయితే, ఈ మధ్యన ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల కోసం మళ్లీ మనవాళ్లు పెద్ద ఎత్తున వెళ్లారు. అంటే ఇప్పుడు వాళ్లకు సంబంధించి కీలకమైన సర్వీసులు అందిస్తుంది ఇండియన్సే. ఒక రకంగా మన ద్వారా వాళ్ళు డెవలప్ అవుతున్నా గాని మన భారతదేశం మీద వాళ్ళకి మనసు నిండా విషమే నింపుకొని ఉన్నారు.

ప్రత్యేక సిక్కు దేశం కావాలని కోరుకునే వాళ్లతో కాంట్రాక్ట్ కాదు అదే వర్గంలో పుట్టినటువంటి వాడే  కెనడా ప్రధానమంత్రి ‌జస్టిన్ ట్రూడో. కెనడా దేశపు అంతర్గత వ్యవహారంలో మనం జోక్యం చేసుకోవడం లేదు. కెనడాలో ఎవరు ఎలా ఉండాలో మనం చెప్పడం లేదు. అక్కడ చివరికి నడిరోడ్డు మీద ఉద్యమాలు చేస్తూ నాశనం అయిపోతున్నా కూడా మనం దాని గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే అది వాళ్ల దేశపు అంతర్గత వ్యవహారం కాబట్టి.

అయితే భారతదేశంలోని పంజాబ్ వ్యవహారాన్ని కెనడా ప్రధానమంత్రి పరిశీలిస్తున్నాడట, గమనిస్తున్నాడట. మనం ఆ దేశం అంతర్గత వ్యవహారాల్ని పట్టించుకోనప్పుడు మన దేశ అంతర్గత వ్యవహారాలు ఆ దేశ ప్రధానమంత్రికి ఎందుకు? కెనడాలో ఉన్న 7,8మంది కలిసి అక్కడ ఒక సిక్కు దేశం కావాలంటే భారతదేశం ఒప్పుకుంటుందా, లేదంటే కెనడాను సిక్కు దేశంగా ప్రకటించాలంటే కెనడా ఒప్పుకుంటుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: