ఉక్రెయిన్‌కు అండగా ఆ దేశాలు.. రష్యాకు చుక్కలేనా?

అమెరికా, యూరప్ దేశాలు  రష్యా ను బూచిగా చూపించి ఉక్రెయిన్ ను భయపెట్టే ప్రయత్నం చేయడంతో ఉక్రెయిన్ దూకుడు పెంచింది. రష్యా కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం బదులు కన్ఫ్యూజ్ చేయడంతో పాటుగా ఆధిపత్య ధోరణి మొదలుపెట్టింది. దాంతో సంఘర్షణ పతాక స్థాయికి చేరింది. దాని ఇంపాక్ట్ ఒకప్పుడు రష్యా నుండి విడిపోయిన దేశాలన్నీ, జార్ చక్రవర్తి కాలంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఆ తర్వాత  ఏదైతే 1990 లో జరిగినటువంటి పెరిస్త్రోయికా తర్వాత విడిపోయినటువంటి దేశాలుగా దర్జా గా బ్రతుకుతున్న వాళ్ళు, యూరప్ దేశాలలో భాగమై పోయిన వాళ్ళు, నాటోలో భాగం అయిపోయిన వాళ్ళు మళ్ళీ రష్యా లో చేరడానికి సిద్ధంగా లేరు.

వాళ్ళందరూ ఇప్పుడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఒక్కటవుతున్నారు. దానికి పోలాండ్ ప్రధాన కారణం అవుతుందట. ఇప్పుటి వరకు ఏంటంటే  రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఈ మద్య రష్యా లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల మీద  ఉక్రెయిన్ దాడి చేస్తుంది. రష్యా  అయితే పూర్తిగా ఆక్రమించే దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎదురు దాడి చేస్తే మాత్రమే గెలవగలమనే జెలెన్ స్కి మాటలకు సంఘీ భావంగా అతడికి కావాల్సిన యుద్ధ విమానాలు, ఆయుధాలు, మిస్సైల్స్ ఇచ్చి రష్యా లోపల ఉన్న ప్రాంతాల మీద దాడి చేసే విధంగా  ప్రోత్సహించడం ద్వారా రష్యా ఇప్పుడు ముందు ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ తన దేశంలో దర్జా గా ఉంది.

కాబట్టి, రష్యా మీద కూడా ఉక్రెయిన్ దాడి చేస్తుంటే ఈ నాటో దేశాల ఆయుధాలను, విమానాలను పెట్టుకొని అప్పుడు రష్యా కూడా నాశనం అవుతుంది. ఇప్పటిదాకా ఏంటంటే ఆర్థికంగా దెబ్బతింటున్నా గాని సైనిక పరంగా, జనాలపరంగా దెబ్బ తినడం లేదు, ఆస్తులపరంగా దెబ్బ తినడం లేదు కాబట్టి అలా దెబ్బ తీయించడం ద్వారా రష్యా ని సెకండ్ ఫేస్ నాశనం చేయబోతున్నారనే విషయం స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: