తారకరత్నను అప్పుడే మీడియా మర్చిపోయిందా?

వ్యక్తిగత జీవితం లోకి చొరబడి అడిగితే సెలబ్రెటీల కుటుంబాలు అంటారు కదా! మరి తారకరత్న కూడా సెలబ్రిటీనే కదా! నందమూరి కుటుంబం సెలబ్రిటీల కుటుంబమే కదా! వాళ్ళ ఇంట్లో జరిగిన ఉదాంతాల గురించి కనీసం ఇప్పుడైనా ఎల్లో మీడియా రాసిందా. తన భర్త, దివంగత నటుడు తారకరత్నను గుర్తు చేసుకుంటూ తాజాగా ఓ భావోద్వేగ పోస్టును పెట్టారు అలేఖ్య రెడ్డి. తమ పెళ్ళి జరిగిన తర్వాత అయినవాళ్లు చూపించిన ద్వేషం వల్ల తన భర్త మానసిక బాధ కు గురయ్యారని చెప్పారు.

నువ్వు మాకు దూరమై సరిగ్గా నెలరోజులవుతుంది. నీ జ్ఞాపకాలు ఇంకా నా మదిలో అలాగే ఉన్నాయి. మనం కలిసాము, స్నేహితులయ్యాము, డేటింగ్ లో ఉన్నాము, మన బంధం ముందుకు కొనసాగుతుందా లేదా అన్న సందేహం వచ్చినప్పుడు జీవితం లో కొత్త ప్రయాణం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నావు నువ్వు.  ఆ నిర్ణయం వల్ల నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. మన పెళ్లి జరిగింది. ఇబ్బందులు ఎదురైనా మనం సంతోషంగా ముందుకు సాగామని గుర్తు చేసుకున్నారు.

ఇంకా ఏం రాశారంటే.. నిష్క పుట్టినప్పటి నుండి మన జీవితంలో సంతోషం పెరిగినప్పటికీ, బాధ మాత్రం అలానే కొనసాగింది. 2019లో ఒక అద్భుతం జరిగింది. మనకు కవల పిల్లలు పుట్టారు. కుటుంబాన్ని నువ్వు ఎంతో మిస్ అవుతున్న కారణంగా మనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంటే బాగుంటుందని అనుకున్నావు. చివరి వరకు నువ్వు ఎంతో ఇబ్బంది పడ్డావు కానీ, ఆ బాధను ఎవరు అర్థం చేసుకోలేదు.

ఆఖరికి నేను కూడా నీ బాధను తగ్గించలేకపోయాను. శాంతి సంతోషం ఉన్నచోట మళ్లీ మనం కలుద్దామని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఆవిడ. అసలు ఏం జరిగింది వాళ్ళింట్లో గొడవ అనేది ఏ ఎల్లో మీడియా అయినా.. ఎవరైనా రాశారా. ఇది చాలా భావోద్వేగ పోస్ట్ అని రాసుకొస్తున్నారు తప్పించి అసలు ఏం జరిగింది వాళ్ళ కుటుంబంలో, ఎవరు వాళ్ళని తిరస్కరించారు ఇది ఎవరైనా రాసుకొచ్చారా అని అభిమానుల అభిప్రాయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: