జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఎన్నికల్లో విజయాలు, అపజయాలు అనేవి కామన్. గ్రామీణ సచివాలయ వ్యవస్థ దాకా తీసుకెళ్లిన పాలన మాత్రం జగన్ ది. అందులో ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలికి కారణం మధ్య తరగతి ఓటర్లే. అయితే మధ్యతరగతి జీవన విధానం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతుంది.

ధరల పెరుగుదలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నూనెలు, పప్పులు, ఉప్పు, వంట సామగ్రి, కరెంట్ ఛార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంట్ ఛార్జీలు అయితే రెండింతలు పెంచేశారు. దీని ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. జగన్ సర్కార్ రాకముందు  వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు రెండింతలు పెరిగాయి. దీని గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర నాయకులు జగన్ వద్ద ఈ విషయాన్ని చెబుతున్నారో లేదో తెలియదు.

కానీ సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం అవుతోంది. మధ్య తరగతి జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఎన్నికల తీర్పులే కారణం. పేద ప్రజలకు ఎలాగో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ మధ్య తరగతి వారికే అన్ని పథకాలు చేరడం లేదు.  దీన్ని అంత ఈజీగా తీసుకుంటే మాత్రం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవు. విద్యుత్ ఛార్జీలతో పాటు రాష్ట్రంలో పెరిగిన ఛార్జీలు, ఇతర ఛార్జీలు అన్నింటిని పరిగణలోకి తీసుకుని ముందుకు పోవాలి.

పెంచాల్సిన వాటిపై కూడా పునరాలోచించాలి. సామాన్య ప్రజలపై భారం ఎక్కువగా పడకుండా చూడాలి. అలా చూసినపుడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తగ్గి ప్రజలు వైసీపీ వైపు చూస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ యువగళం పాదయాత్ర, జనసేన వారాహి యాత్ర, బీజేపీ దూకుడు, ఇలా అన్ని వైపులా ప్రతిపక్షాలు ప్రజల్లోకి దూసుకెళుతున్నాయి. ప్రస్తుతం ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా వైసీపీ పార్టీకి  వచ్చే సాధారణ ఎన్నికల్లో పరాభవం తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: