ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా బ్యాంకుల సంక్షోభం?

మొన్నటి వరకు భారత ఆర్థిక రంగంపై దాడులు చేసి నాశనం చేయాలనుకున్న అమెరికాకు ప్రస్తుతం అక్కడ ఉన్న 30 బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆదాని గ్రూపును దెబ్బ కొట్టి భారత ఆర్థిక రంగాన్ని కుదేలు చేయాలని అమెరికా బ్రిటన్ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. అందులో భాగమే  హిండెన్ బర్గ్ నివేదిక అనే విమర్శలు ఉన్నాయి.

ఆ తర్వాత దేశంలోని రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకొని అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన వ్యాపారస్తులు జార్జ్ సొరోస్  లాంటి వాళ్ళు కొన్ని నివేదికలను బయటపెట్టి, ఆధాని గ్రూపుల పేర్లు పడిపోయేటట్టు చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనితో  దేశంలో ఏదో ఆర్థిక ముప్పు వస్తుందని నమ్మించేందుకు కుట్ర పన్నారు. కానీ భారత ఆర్థిక రంగం పూర్తి పటిష్టంగా ఉందని ఆదాని నష్టపోయినంత మాత్రాన దేశానికి వచ్చే ముప్పు ఏమీ లేదని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు.

అదానీ ఎల్ఐసి గ్రూపులో తీసుకున్న షేర్లు కూడా కేవలం 5000 నుంచి 6000 కోట్లు మాత్రమే ఉంటాయని అది ఎంత పెద్ద అమౌంట్ కూడా కాదని ఎల్ఐసి కి సంబంధించిన ఆస్తి 40 లక్షల కోట్ల విలువైన స్థాయిలో ఉందని దానికి చింతించవలసిన అవసరం లేదు అని ఆమె ప్రకటించారు.  మొత్తం మీద ఇప్పటివరకు దేశంలో ఆర్థిక రంగాన్ని దెబ్బతీయాలని చూసిన అమెరికాకు ప్రస్తుతం అక్కడి బ్యాంకులు నష్టపోతున్నాయి. తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.  వాటిని బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

అయితే మొన్నటి వరకు ఇండియా లోని వ్యాపారులని టార్గెట్ చేసుకొని కొన్ని ఫేక్ నివేదికల తోటి కుట్రలు పన్నాయి.  పాపం పండి ఇప్పుడు అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి దాపురించింది. అందుకే చేరపకురా చెడేవు అన్నారు పెద్దలు. మరి ఇలాంటి బ్యాంకుల సంక్షోభ పరిస్థితుల నుంచి అమెరికా ఏ విధంగా బయటపడుతుందో.. ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: