జీ20 రాజకీయాలు.. ఇండియాకు కత్తిమీద సాము?

దేశంలోని సంపదలో 70 శాతం వరకు ఖర్చయితే 30 శాతం ఆదాయం లేని రాష్ట్రాలకు ఖర్చు పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఆ తర్వాత దాన్ని 50 శాతం వరకు పెంచింది కాంగ్రెస్. దేశం మొత్తం మీద సంపదను వెనకబడిన రాష్ట్రాలకు ఇస్తుండేది. తర్వాత కాలంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఎక్కువగా సంపదను అందించేవారు. ఆదాయం వచ్చే రాష్ట్రాలు ఒకటయితే వాటిని ఖర్చు పెట్టేది మరో ప్రాంతంలో అన్న మాట.

ఇలా అన్ని రాష్ట్రాలను అభివృద్ది చేసే కార్యక్రమమే ప్రణాళిక సంఘం. వాజ్ పేయి హాయాంలో మార్చాలని ప్రయత్నించినా.. ప్రణాళిక సంఘం ఒక్క సారి 10 ఏళ్లకు సరిపడా నిధులను కేటాయించేంది. కానీ దాన్ని రద్దు చేయాలని అనుకున్న కోర్టులు ఒప్పుకోలేదు. దేశ ప్రజలకు సంబంధించిన సొత్తును ప్రభుత్వానికి హక్కు లేకుండా ప్రణాళిక సంఘం స్వతంత్రంగా ఖర్చు పెడుతుందనుకుంటే దాన్ని ఆపాలని వాజ్ పేయి ప్రయత్నించారు. కానీ దాన్ని సాగనివ్వలేరు.

అయితే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని తీసిపాడేశారు. అనంతరం నీతి ఆయోగ్ ను కొత్తగా తీసుకొచ్చారు. తద్వారా రాష్ట్రాలకు 39 రూపాయలకు బదులు 41 రూపాయాలు ఇచ్చే వారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఐక్యరాజ్య సమితి దేశాల మధ్య సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు పెద్దన్న పాత్ర పోషించేది. తర్వాత ఐక్యరాజ్య సమితిలో అమెరికా పాత్ర ఎక్కువ కావడంతో దాని మీద కూడా విశ్వాసం సన్నగిల్లింది. తర్వాత జీ 20 దేశాలు ఏర్పడ్డాయి.

ప్రపంచంలో నే ఆర్థిక పరంగా బలమైన 20 దేశాలు ఒక్కటై ఏమైనా మార్చాలనుకోవడం కోసం ఒక గ్రూపుగా ఏర్పడ్డాయి. వీటి పని ఆయా దేశాలు ఆర్థికపరంగా సపోర్టు చేసుకోవాలి. కానీ అది మరిచి రష్యాను బహిష్కరిద్దాం.. ఉక్రెయిన్ కు సపోర్టు చేద్దాం అనే ధోరణి కనిపిస్తోంది. అసలైన విషయాల్ని పక్కన పెట్టి రాజకీయాల కోసం జీ 20ని వాడుకుని ఇష్టారీతిన చేసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: