తెలంగాణలో అన్నం.. బాబు చెప్పిందే నిజమా?

తెలంగాణలో అన్నం మేమొచ్చాకే తిన్నారు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిమీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు  అనిల్ సూరపనేని ఓ వాదన వినిపిస్తున్నారు. ఆయన చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు అన్నం, బడులు తెలంగాణలో తెలుగుదేశం వచ్చాకే వచ్చాయి అని చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కువగా, భారత రాష్ట్ర సమితి వాళ్ళు తక్కువ గా ఎగతాళి చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజమా అంటే అబద్దం అని తెలుస్తుందంటున్నారు.

తెలంగాణలో అన్నం, బడులు  కొంచెం ముందుగానే పరిచయం అయ్యాయి. కానీ  అవి జనాల్లో కేవలం 25 శాతానికి మాత్రమే అందుబాటులో ఉండేవి. కోస్తా జిల్లాలో క్రైస్తవీకరణ వల్ల విద్య సామాన్య జనాలకు 4 దశాబ్దాలకు ముందే అందుబాటులోకి వచ్చింది.  కోస్తాకు, తెలంగాణకు ఈ విద్యా సంబంధిత ప్రభావం వల్ల సమాజ నిర్మాణంలో కొంత భిన్నత్వం ఉండేది. కమ్యూనిస్టుల ప్రభావంతో అభివృద్ధి ఫలాలు కొంచెం అణగారిన వారికి అందినా అవి తక్కువ స్ధాయిలోనే ఉండేవి. తెలుగుదేశం నిర్మాణం, దాని అంశ కూడా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని చెబుతున్నారు.  

షాద్‌ నగర్లో అనిల్ సూరపనేనికు పరిచయం అయిన ఒక పెద్దాయన చాలా విషయాలు మాట్లాడారట. మండల వ్యవస్థ పెట్టి సామాన్యులు పనులు చాలా వరకు అక్కడే అందుబాటులోకి తెచ్చారట. రవాణా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండేది. వానలకు వాగులు, వంకలు పొంగితే ఇక అంతే సంగతులు. ఎన్టీఆర్ స్కూల్ కూడా సిబ్బందితో ఇబ్బడిముబ్బడిగా మొదలుపెట్టారు. అప్పుడు కేంద్ర ప్రాధాన్యంలో విద్య చేరడం కూడా బాగా దోహద పడిందని అనిల్ సూరపనేని అంటున్నారు.

చంద్రబాబు హయాంలోకి వచ్చాక విద్యా విషయంలో మార్పు నిర్బంధంగా అమలు చేసేవారని... స్కూల్ నుండి వెళ్లిపోయి పశువులు కాసే పిల్లల్ని సైతం లాక్కొచ్చి బడుల్లో వేయడం, ఆఫీసర్ అంటే అధికారం చెలాయించే వాడు కాదు, ప్రజల సమస్యలను ఈడేర్చే వాడు అని జవాబుదారీ చేయడంతో పాటు అధికారులను, నాయకులనూ, ప్రజలకు అందుబాటులో ఉంచి స్పందింప చేసిన పరిస్థితి కల్పించారని అనిల్ సూరపనేని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: