అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

గతంలో నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మృత్యు బేహారి అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి. నరేంద్ర మోడీతో పాటు మిగతా వారు కూడా సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. బేహారీ అంటే వ్యాపారి అని అర్థం.. అంటే  చావులు తెచ్చిపెట్టే వారని అర్థం. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విధమైన వ్యాఖ్యల్ని అమెరికాపై చేస్తున్నారు. అమెరికాపై దుమ్మెత్తి పోస్తున్నారు.

అమెరికాను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ల మీద అమెరికాకు జో బైడెన్ కు ప్రేమ లేదు. అక్కడ ఉన్న వనరులపై మాత్రమే ప్రేమ ఉందని చెప్పారు. మరియ జకోవా రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రష్యాను నాశనం చేయడానికి పుతిన్ ను చంపాడానికి అమెరికా పన్నిన కుట్రను మేం భగ్నం చేశాం. అమెరికా చేస్తున్న అరాచకాలను రష్యా ఎండగట్టినందుకే ఉక్రెయిన్ ను అడ్డుపెట్టుకొని నాటో దేశాల సాయంతో అమెరికా రష్యాపై దాడులకు తెగబడుతోంది.

ఇప్పటివరకు అమెరికా చాలా దేశాలను ఆక్రమించి అక్కడ ఉన్న ఆర్థిక వనరుల్ని కొల్లగొట్టి ఆ దేశానికి తీసుకుపోతుంది. తదనంతరం అక్కడ శాంతి చేకూరిందనే మాయమాటలు చెప్పి చేతులెత్తుస్తుంది. ఇరాక్, ఆఫ్గానిస్తాన్ లాంటి దేశాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికి ఇది తెలిసిన విషయమే.

అమెరికాను ధీటుగా ఎదుర్కొంటున్న దేశం అంటే మాత్రం రష్యా ఒక్కటే. ఉక్రెయిన్ కు సపోర్టు చేసినట్లే చేసి అక్కడ తిష్ట వేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. దీన్ని ఎన్నటికీ సాగనివ్వమని రష్యా కుండబద్దలు కొట్టి చెప్పింది. మా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అమెరికా ఏ పని చేసినా దానికి లాభం వస్తేనే చేస్తుందని రష్యా ఆరోపించింది. రష్యా పౌరులను కాపాడుకునేందుకు, ఉక్రెయిన్ లో రష్యా మాట్లాడే వారిపై దాడులను ఆపేందుకే యుద్ధం చేయాల్సి వస్తోందని రష్యా ఇప్పటికే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: