ఛీఛీ.. కొత్త దంపతుల వింత కోరికలు?

అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో పిల్లలు కనవద్దని కోరుకుంటున్న వారి శాతం పెరిగిపోతుంది. అమెరికాలో 44 శాతం మంది తమకు బిడ్డలు వద్దని అనుకుంటున్నారు. ఇంగ్లాండులో 35 నుంచి 45 ఏళ్లున్న వారు 50 శాతం మంది తమకు బిడ్డల్ని కనాలని ఇష్టం లేదని అనుకుంటున్నట్లు తేలింది. మొదట్లో ఒక బిడ్డ చాలు అనే స్థాయి నుంచి ప్రస్తుతం అసలు పిల్లలే వద్దనే స్టేజికి వచ్చేశారు. పిల్లల్ని కనడం వల్ల వారి పెంచడం, పోషించడం వారితో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కోణంలో చైల్డ్ ఫ్రీ లైఫ్ కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

వీరు ఒక నినాదాన్ని బయటకు తెచ్చారు. అదే డబుల్ ఇన్ కం, విత్ అవుట్ కిడ్స్ అనే నినాదాన్ని వెలుగులోకి తెచ్చారు. విత్అవుట్ కిట్స్ ఎంజాయ్ చేద్దాం అనే భావన వీరిలో వచ్చింది. అయితే 40 సంవత్సరాల్లో ఎంజాయ్ చేద్దామనుకుంటున్న జనం తర్వాత రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఊహించుకోలేకపోతున్నారు.

ఒక సృష్టి ధర్మాన్ని మరిచి పిల్లల్ని కనవద్దని కోరుకోవడం ఒక వింతైతే, పిల్లల్ని కన్న తర్వాత వారికి సరైన సౌకర్యాలు కల్పించలేం, వారికి అనుకున్నవన్ని చేయలేమని చెప్పుకుంటున్నారు. గతంలో ఇంత టెక్నాలజీ, ఇన్ని సౌకర్యాలు లేకున్నా అప్పటి మన అమ్మానాన్నలు ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. పెంచి పెద్ద చేశారు.

నువ్వు చిన్నప్పుడు కష్టపడ్డావంటే నీకు పుట్టే బిడ్డలు కష్టపడకూడదని పిల్లల్ని కనడం మానేస్తారా? కష్టాలే పడకుండా పెరిగి పెద్దయితే ఆ తర్వాత కష్టాలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలు కష్టాలు పడాలి, వాటిని పరిష్కరించుకునే మార్గాలను వెతుక్కోవాలి. సమాజంలో ఎలా బతకాలో నేర్పాలంటే పిల్లలు కష్టాలు పడాల్సిందే.  కడుపు వస్తే లావు అయితారని, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయని పిల్లల్ని కనకపోవడం అత్యంత దారుణం. వీరి లాగే వీళ్ల అమ్మానాన్నలు ఆలోచిస్తే ఈ రోజు వీరు ఈ భూమ్మీద ఉండకపోయే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: