సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న ప్రచారం?

ఏదైనా వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ప్రచారం కోసం పత్రికలకు, న్యూస్ ఛానళ్లకు అడ్వర్టయిజ్ మెంట్లు ఇచ్చేవారు. క్రమంగా న్యూస్ ఛానళ్లకు అడ్వర్టజ్ మెంట్ లు తగ్గించి ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎలాగైనా తమ ప్రొడక్టుకు సంబంధించి ప్రజల నోళ్లలో నానేలా ప్రకటనలు ఇవ్వడం ఆయా సంస్థలకు అలవాటు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్న తరుణంలో అడ్వర్టయిజ్ మెంట్లను ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఇస్తున్నారు. లక్షల కోట్ల రూపాయాల మార్కెట్ నడుస్తుంది.

నెక్స్ట్ స్టేజ్ లో యూట్యూబ్, ఇన్ స్టా గ్రాం, రీల్స్ చేసే అమ్మాయిలు, లేదా సెలబ్రెటీలుగా ఇమేజ్ సాధించుకున్న వారిని ఐడెంటీపై చేసి వారికి మెయిల్ ద్వారా మేసేజ్ పంపిస్తారు. మా కంపెనీకి చెందిన చీర పంపిస్తాం. ఇది మీరు ఉంచుకుని మాకు అడ్వర్టజ్ మెంట్ చేయండి. వంటలు చేసే వారికైతే మీకు రైస్ కుక్కర్, లేదా వంటపాత్రలు మీవే.. మాకు ఈ రీల్ చేసి పెట్టండని బడా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గాలను వెతుక్కుంటున్నాయి.

పత్రికలు చదివే వారు వార్తలు ఎక్కువగా చూస్తారు. ప్రకటనలు చూడరు. టీవీలో ఫలానా సీరియల్ వచ్చే సమయంలో మాత్రమే అడ్వర్టజ్ మెంట్లు చూస్తారు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారు తాము చేసిన దాన్ని సోషల్ ప్రపంచానికి విడుదల చేస్తుంటారు. దీనితో ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. దీంట్లో ప్రస్తుతం పెడధోరణులు వస్తున్నాయి. మన వ్యాపారం గురించి మంచి చెప్పడమే కాకుండా ఎదుటి బ్రాండ్ల గురించి చెడుగా చెప్పించడం అలవాటై పోయిందని అనుకుంటున్నారు.

ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలకు తలనొప్పిగా మారుతోంది. దీంతో బడా కార్పొరేట్ బాబులు తమ ప్రొడక్టు గురించి నెగటివ్ చెప్పమని వస్తే చెప్పకండి.. అలాంటి సమాచారం మీ వద్ద ఉంటే మాకు ముందుగా తెలియజేయండి మీకు సరైన డబ్బులు ఇస్తామని ప్రాధేయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: