ఆర్థిక సంక్షోభం: పాక్‌ ప్రధాని కీలక నిర్ణయం?

తినడానికి  తిండి లేకున్నా భారత్ సర్కారును ఇబ్బంది పెడతాం.. భారత వ్యాపారాన్ని దెబ్బకొడతాం.. రక్షణ రంగాన్ని కూలదోస్తాం అంటూ పిచ్చికూతలు కూయడంలో పాకిస్థాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది.. కానీ పాకిస్థాన్ లో తినడానికి గోధుమ పిండి  దొరకని పరిస్థితి ఉంది. కరెంట్ ఛార్జీలు కట్టడానికి ప్రజల వద్ద డబ్బులు కూడా లేవు. దాదాపు కరెంట్ ఛార్జీలు 600 రేట్లు పెరిగాయి. వీటిని పాక్ ప్రజలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

పాకిస్థాన్ కు సంబంధించి మరో కీలకమైన ప్రక్రియ జరిగింది. ఐఎంఎఫ్‌ లోన్లకు సంబంధించి ఆంక్షలను అమలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాద్ షరీఫ్ చర్యలు చేపట్టారు. పాకిస్థాన్ మంత్రులు బిజినెస్ క్లాసులో ప్రయాణం చేయకుండా ఆంక్షలు చేపట్టారు. అలాగే పైవ్ స్టార్ హోటళ్లో బస చేయకుండా ఉండాలని ఆదేశించారు. పారిన్ ట్రిపులను కూడాా ఎకానమీ క్లాస్ లలోనే చేయాలని చెప్పారు.

పాక్ ఐఎంఎఫ్‌ లోన్ కు సంబంధించి 6 మిలియన్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఈ సమయంలో లగ్జరీ లైఫ్ కు దూరంగా ఉండాలని పాక్ ప్రధాని తన మంత్రులకు సూచించారు. మొన్నటి వరకు ప్రధాని తన పదవిని కాపాడుకోవడానికి మంత్రులకు లగ్జరీ కార్లను అందించారు. కానీ ప్రస్తుతం ఖర్చు తగ్గించుకుంటేనే పాక్ లో ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చని అనుకుంటున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ లో  వృథా ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. అందుకే అందరూ విమానాల్లో ఎకానమీ క్లాస్ లలోనే ప్రయాణించాలని సూచించారు. బిజినెస్ క్లాస్ లో వద్దన్నారు. ఫైవ్ స్టార్ హోటల్లో కాకుండా సాధారణ హెటల్లో ఉండి ఖర్చులను తగ్గిస్తూ ఆర్థికంగా కోలుకునేందుకు  సహకరించాలని కోరారు. ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. భారత్ పై తన అక్కసును వెల్లగక్కుతూనే ఉంది. ఇదే విధంగా కొనసాగితే పాకిస్థాన్ ప్రజలు ఆకలికి అలమటించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: