భారత్‌లో బొగ్గు సంక్షోభం.. మోదీ జాగ్రత్తలు?

దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు క్షేత్రాల్లో అత్యవసర ఉత్తర్వులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీరు సెలవులు తీసుకోండి, కానీ సమ్మెలాంటివి జరగడానికి అయితే వీల్లేదు అని ఆ ఉత్తర్వుల సారాంశం. ఎందుకు అకస్మాత్తుగా ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటే  వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల అని తెలుస్తుంది. మొన్న శివరాత్రి తో చలికాలం శివ శివ అంటూ వెళ్లిపోయి ఎండాకాలం మొదలైపోయింది.

ఈ ఏడాది విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో, లానినో అని పిలవబడే వాతావరణానికి సంబంధించి గత రెండు మూడు ఏళ్ల నుండి ఎండలు అంతకుముందు ఎండలతో పోల్చుకుంటే అంతగా లేనట్టే లెక్క. అయితే ఇప్పుడు ఎండలు మళ్ళీ గతంలో పెరిగిన గరిష్ట స్థాయిల కన్నా మించి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. 35 డిగ్రీలు అంటే అది సాధారణ ఉష్ణోగ్రత, కానీ ఇప్పుడు  ఉష్ణోగ్రతలు 40, 45, 48 డిగ్రీల వరకు  ఎండలు మళ్ళీ కాయబోతున్నాయని తెలుస్తుంది.

కరెంటు ఉత్పత్తి కోసం సోలార్ పవర్, విండ్ పవర్ వీటితోపాటు బొగ్గు ఆధారిత విద్యుత్ మీదనే మనం ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. ఇంకొకటి ఎండాకాలంలో హైడ్రోపవర్స్ సరిగ్గా పని చేయవు. ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్లు ఉండవు కాబట్టి. 79% మన దేశం ఈ థర్మల్ పవర్ మీదనే ఆధారపడుతుంది. కాబట్టి    79% ఉత్పత్తి కోసం ఇప్పుడు అర్జెంటుగా బొగ్గు కావాలి. అందుకే బొగ్గు క్షేత్రాలన్నింటిలోనూ తవ్వకాలు మొదలు పెట్టింది ప్రభుత్వం.

అదే సందర్భంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాలన్నింటిని కూడా సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల్లో బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాల్లో వర్షాకాలం ఎండాకాలంలో వాటికి కాస్ట్ అవుతూ అవుతుంది కాబట్టి వాటిని షూట్ డౌన్ చేశారు. ఇప్పుడు అవి అన్నింటినీ రీఓపెన్ చేసుకోవడానికి  అంతా ప్రిపేర్ చేసుకోవాలి. క్రిందటసారి అది తెలియదు అని చెప్పారు ఇప్పుడు గాని ముందుగా కళ్ళు తెరిచి అంతా సిద్ధం చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: