బాబు, పవన్‌ దిమ్మతిరిగేలా జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌?

రాజకీయం అనేది పరుగు పందెం.. ఒక మారథాన్ లాంటిది. ఎప్పుడూ పరుగెత్తుతూనే ఉండాలి.  ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చున్న రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు వింటూ పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ప్రజల వద్దకు వెళ్లడంలో అప్పుడప్పుడు వెనక బడినట్లు కనిపిస్తోంది. కానీ వైఎస్సార్ పార్టీ పరుగెడుతూనే ఉంది.

జనసేన పార్టీ మాత్రం టీడీపీ కంటే వెనకాలే ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చినపుడు మాత్రమే ప్రజల్లో కి జనసేన పార్టీ నాయకులు వెళుతున్నారు. ఆ తర్వాత చురుకుగా ఉండటం లేదు. కానీ వైఎస్సార్ పార్టీ జగన్ మాత్రం తమ నేతలు జనాల్లో ఉండేలా చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి తెలుగుదేశం నుంచి వచ్చిన జయమంగళం వెంకటరమణకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కన్పర్మ్ చేసేసింది.

చేనేత రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన నాయకుడిని వైసీపీ నియమించింది. టీడీపీ కన్నా లక్ష్మీనారాయణ, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లను లాగేసుకుంటోంది. కానీ జనసేన, బీజేపీలో మాత్రం చేరికలు ఉండటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం ఆంధ్రలో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో  ఎమ్మెల్సీలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ పార్టీ ఇచ్చేసింది. కానీ తెలుగుదేశం నుంచి వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇస్తామని మూడు సార్లు మోసం చేశారు.

కానీ వైసీపీ నుంచి బీసీ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు రావడం ఒకప్పటి బీసీల ప్రభుత్వం అని టీడీపీ చెప్పుకొనేది. కానీ ఇప్పుడు జగన్ ఇచ్చిన ఝలక్ తో టీడీపీకి బీసీలు దూరమయ్యేలా కనిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏళ్ల తరబడి బీసీల ఓట్లు టీడీపీకే పడేవి. వైసీపీ పార్టీ బీసీలకు పూర్తి సహకారం ఇస్తోంది. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇలాగే ఇస్తే జనసేన, టీడీపీలు కూడా తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: