చైనా దాచిన భయంకర నిజం.. బయటికొచ్చింది!

చైనా కరోనా గురించి దాచిన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ కరోలినా, నార్త్ కరోలినా, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, కొలంబియా వీళ్ళందరూ కలిసి చేసిన సమీక్షలో గత రెండు నెలల్లో అంటే డిసెంబర్ 22 నుండి జనవరి దాకా 10 లక్షల మంది వరకు చనిపోయారని అవి అంచనా వేశాయి.

అదే సందర్భంలో 87,468 మంది మాత్రమే చనిపోయారని చైనా లెక్కలు చెప్తుంది, అంటే చైనా దొంగ లెక్కలు బయటపడ్డాయి. అంటే అది మిగతా వాళ్ళు ఎలా చనిపోయారు అని చెప్తుంది అంటే కిడ్నీ, గుండె, లివర్ సమస్యలతో చనిపోయారని చెప్తుంది. శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్లో చేరి చనిపోయిన వాళ్లను మాత్రమే చైనా కరోనా మృతులుగా చూపించినట్లుగా విషయం బయటపడింది.

ఈ జబ్బుకు ఆరిజన్ ఎక్కడ‌ మొదలయిందో అక్కడ నేను విచారించాలి, అలా విచారించడానికి అనుమతులు ఇవ్వండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ మరొకసారి చైనాను  అభ్యర్థించాడు. చైనా మాత్రం నిర్లక్ష్యంగా ఇప్పటికే రెండుసార్లు మీ వాళ్ళు వచ్చారు ఇంకోసారి రావక్కర్లేదని చెప్తుంది. ఆరిజన్ కనుక్కోకపోతే, కరోనా ఎక్కడ మొదలైందో దానికి కారణం కనుక్కోకపోతే మందులు కనిపెట్టడం కష్టం. అలా అయినా సరే దీనిపై అనుమతి ఇవ్వడానికి చైనా నిరాకరిస్తుంది.

చైనా లేబరేటరీలో తయారుచేసి ప్రపంచం పైకి వదిలిన కరోనా అనే భూతం దెబ్బకి ప్రపంచమంతా తలకిందులు అయిపోయింది. అనేక లక్షల మందికి పైగా చనిపోయారు. అంతెందుకు అది వదిలిన భూతం తన ప్రజలను తినేస్తున్నా సరే, తన ప్రజలు ఎంతమంది చనిపోతున్నా సరే, ప్రపంచ దేశాలు ఏమైపోతున్నా సరే చైనాకు చీమకుట్టినట్లుగా కూడా ఉండడం లేదు. చైనా తాను తన తవ్విన గోతిలో తానే పడిందని తెలిసినా సరే, ఏ మాత్రం అదురు బెదురు లేకుండా, ప్రపంచ దేశాల పరిస్థితిని కూడా పట్టించుకోకుండా అంత దర్జాగా ఎలా ఉండగలుగుతుందో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: