ఆంధ్రా అభివృద్ధికి ఢోకా లేదా.. ఇదిగో సాక్ష్యం?

చైనాలో సదుపాయాలు బాగుంటేనే పరిశ్రమలు వెల్లువలా వెళ్లి అక్కడ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇప్పుడున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్ లు వెళ్లి మా దేశానికి రండి అని ఎవర్ని బతిమిలాడలేదు. అలాగే భారత్ లోని గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రస్తుత ప్రధాని, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మోడీ పాత్ర కూడా ఉంటుంది. అలాగని అనునిత్యం నేనే అభివృద్ధి చేశానని చెప్పుకోరు. కేవలం గుజరాత్ అభివృద్ధిని చూసి ఓటు వేయండని అంటుంటారు.

గుజరాత్ కు సముద్ర తీర ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఇది వారికి ఒక అడ్వంటేజ్ అంటే గుజరాత్ లో అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి తీర ప్రాంతం కారణమైంది. ముఖ్యంగా సరకు రవాణా, ఉత్పత్తి సంస్థలు ఎక్కువగా వచ్చాయి. వాటిని తీసుకురావడంలో ప్రభుత్వం కూడా ప్రముఖ పాత్ర  పోషించింది. తీర ప్రాంతాలతై ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.

అయితే ఏ పరిశ్రమ అయినా వారికి అవసరమైతేనే పెట్టుబడి పెట్టడానికి సిద్దమవుతారు. ఆయా రాష్ట్రాల్లో వారి వ్యాపార, వాణిజ్య అభివృద్ధి ఏ మేరకు లాభిస్తుందో తెలుసుకుని పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఏపీలో అనేక పరిశ్రమలు పెట్టడానికి వాతావరణం అనుకూలిస్తుంది. గుజరాత్ తర్వాత అంతటి సముద్ర తీర ప్రాంతం ఉంది. విశాలమైన మైదానాలు ఉన్నాయి. అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అంటే అన్నింటా అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లే కనిపిస్తున్నాయి.

ఈ సమయంలో ఇన్పోసిస్ సంస్థ విశాఖలోని రిషికొండ ప్రాంతంలో తన కార్యాలయాన్ని స్థాపించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తి దశకు వచ్చేశాయి. కార్యాలయం త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖ సాగర తీరం అనేక పరిశ్రమలు పెట్టడానికి అనుకూలంగా ఉండటమే కాదు  వాతావరణం కూడా ఆహ్లదంగా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలు రావడానికి కాస్త కృషి చేస్తే చాలు ఏపీలో పెట్టుబడులు వరదలా వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: