భారత్‌కు అండగా అమెరికా.. చైనా ఉక్కిరిబిక్కిరి?

చైనా ఆర్థిక సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఇన్ ఫ్రా, డిఫెన్స్, డిప్లమసి, అనే మూడింటితో చైనా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇన్ ఫ్రాలో ఎక్కువగా పెట్టుబడి పెట్టిన చైనా ఆ ఖర్చును తిరిగి రాబడి రూపంలో తీసుకోలేకపోతుంది. డిఫెన్స్ విభాగంలో కూడా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఆయుధాలను తయారు చేసింది. కానీ కొనే వారు కరవయ్యారు. ఎందుకంటే చైనా తయారు చేసిన ఆయుధాలను కొనే దేశాలు అన్ని చిన్నవే కావడం. ఆయా దేశాలు ఆర్థికంగా కుదేలు కావడంతో అవి చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఏమీ చేయాలో తోచని పరిస్థితి డ్రాగన్ దేశానిది.

మరొక అంశం డిప్లమసి విధానం.. ఒక దేశం నుంచి మరో దేశం మధ్య చిచ్చు పెట్టడం, తర్వాత వాటిని తమకు అనుకూలంగా మలుచుకొని అక్కడ చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం. ఇది పెద్ద దేశాల మధ్య కుదరడం లేదు. కానీ చిన్న దేశాల్లో చైనా విజయవంతమైందని చెప్పొచ్చు.
ప్రస్తుతం  భారత్ హిమచల్ నుంచి లడాఖ్ దాకా ఇన్ ఫ్రా ను డెవలఫ్ మెంట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 206 మిలియన్ డాలర్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. దాదాపు 50 వేల సైన్యం, 9 వేల ట్రూపులు అక్కడ పహారా కాసేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత 17 సార్లు చైనాతో చర్చలు జరిపినా ఏ మాత్రం పరిష్కారం దొరకలేదు.

తాజాగా అమెరికా ఆ ప్రాంతంలో భద్రతకు సంబంధించి కొత్త హర్డ్ వేర్ ను భారత్ కు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ను కూడా ఇవ్వనుంది. అమెరికా, భారత్ లు కలిపి కొత్త యూఏవీలు తయారు చేసి వచ్చే ఏడాదికి ఆ ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయనున్నాయి. భారత్ లోని సరిహద్దు ప్రాంతంలో  యూఎస్ఏ డిపెన్స్ కంపెనీలు డైరెక్టుగా అక్కడికే వచ్చి రంగంలోకి దిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: