మూలిగే పాకిస్తాన్‌ను ఘోరంగా దెబ్బ తీసిన రేటింగ్?

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేందుకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాక్‌ను గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌ ఇచ్చిన రేటింగ్ మరింత దెబ్ తీసింది. పాకిస్థాన్ కరెన్సీకి ఫిచ్‌ తాను ఇచ్చిన రేటింగ్‌ను CCC+ నుంచి CCCమైనస్‌కు తగ్గించింది. దీంతో పాకిస్థాన్ నగదు మరింత పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని రోజుల క్రితం మరో ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్‌ అండ్‌ పీ పాకిస్థాన్ రేటింగ్‌ను B నుంచి CCC+ తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు  ఫిచ్‌ మాత్రం అంతకంటే తక్కువగా రేటింగ్‌ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కనిష్ఠానికి పడిపోవడం, బయటనుంచి ద్రవ్య మద్దతు తగ్గడం.. పాక్‌ పతనం అంచున ఉన్న సంగతి తెలిసిందే. IMF నుంచి బెయిల్‌ అవుట్ ప్యాకేజీ పొందేందుకు పాకిస్తాన్ 10 రోజులు విస్తృతంగా చర్చలు జరుపుతోంది. కానీ.. ఈ ఒప్పందం మాత్రం కుదరనేలేదు. అందుకు IMF విధిస్తున్న షరతులే  కారణంగా తెలుస్తోంది. IMF షరతులు అమలు చేస్తే.. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న పాక్‌లో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతాయి.

అసలే త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే పాక్‌ అధికారపక్షం ఆలోచనలో ఉంది.  IMF షరతులపై ఎటూ తేల్చుకోలేక మథన పడుతోంది. IMFతో ఒప్పందం కుదరలేదు కాబట్టి పాక్  ఆర్థికవ్యవస్థ మరింత దిగజారడం ఖాయమని  ఫిచ్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే పాకిస్థాన్‌ రూపాయి విలువ దారుణంగా  పడిపోయింది. పాక్‌లో ఇంధనాల ధరలు ఐదు రెట్ల వరకూ పెరిగాయి. ద్రవ్యోల్బణం కూడా 27శాతం దాటిపోయింది.

IMF ఒప్పందం కుదరకపోతే చైనా, సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా పాక్ కు నిధులు ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. పాక్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొంత వరకూ ఉన్నా... ఆర్థికవ్యవస్థ పతనం దిశగానే ఉందని ఫిచ్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: