అమ్మ దొంగ చైనా!.. సీసీ కెమేరాలతో గూఢచర్యమా?

ప్రపంచ వ్యాప్తంగా సీసీ కెమెరాల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉంది. దాదాపు వరల్డ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో 30, 40 శాతం వరకు ఇక్కడ తయారైనవే. కానీ అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పుడు సీసీ కెమెరాల తయారీలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సీసీ కెమెరాల రికార్డింగ్స్ ను చైనా ఎప్పటికప్పుడు రహస్యంగా గమనిస్తున్నట్లు బయటపడింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వ భవనాల్లో 200కు పైగా చైనా నుంచి తెప్పించిన సీసీ కెమెరాలను తొలగించింది. దీనికి సంబంధించి చైనా గుర్రుగా ఉన్నా తమకు తమ దేశ భద్రతే ముఖ్యమైనదని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియాలో ఉన్న సీసీ కెమెరాలను చైనా తమ దేశం నుంచే సీక్రెట్ గా చూస్తోందని వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉన్నట్లు ఆరోపణలు గుప్పించింది. దీనిపై చైనా ఆగ్రహంగా ఉంది.

ఈ సీసీ కెమెరాలు తయారు చేసే కంపెనీతో చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధం ఉన్నట్లు తెలిసింది. అమెరికా, బ్రిటన్ ఈ సీసీ కెమెరాలపై రిస్ట్రిక్షన్ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 సీసీ కెమెరాల్లో 8 ఇక్కడివే కావడం గమనార్హం. సర్వర్స్ ను చైనా నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఈక్విజన్, డావువా అనే కంపెనీలకు చెందిన సీసీ కెమెరాలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు చైనా కమ్యూనిస్టులతో సంబంధం ఉంది.

చైనాలోని చాన్ చిన్ నగరంలో 2.5 మిలియన్ కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. 15 మిలియన్ల జనాభా ఉన్న చోట ఇన్ని సీసీ కెమెరాలు ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. 54 దేశాలకు 45.4 బిలియన్ కెమెరాలను చైనా అమ్మింది. 2021లో 28.02 బిలియన్ కెమెరాలను అమ్మింది. ప్రపంచంలోని అన్ని చోట్ల ఇళ్లు, రోడ్లు, ఆఫీసులు ఇలా అంతటా చైనా కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇండియాలో ఉన్న 35 శాతం సీసీ కెమెరాలు చైనాలో తయారు చేసినవే కావడం వాటిని మనం వినియోగించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: