లోకేశ్‌ను జగనే జాకీలు వేసి పైకి లేపుతున్నారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ బెంగుళూరులో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్న జగన్ ని రాజకీయాల్లోకి లాగింది మాత్రం చంద్రబాబే. ఆ కేసు ఈ కేసు అనుకుంటూ లక్ష కోట్ల అవినీతి అని ప్రచారం చేసి లేని పబ్లిసిటీ కల్పించి చివరకు సీఎం అయ్యే వరకు దగ్గరుండి చంద్రబాబే జగన్ కు సీఎం పదవి అప్పజెప్పారనుకోవచ్చు.

ప్రస్తుతం ఏపీలో కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రను వైసీపీ అధిష్టానం అడుగడుగునా అడ్డుకుంటోంది. పాదయాత్ర చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మాట్లాడితే కేసులు పెడుతూ లోకేష్ పాదయాత్రను హైలైట్ చేస్తుంది.

దీంతో ప్రజల్లో కూడా కాస్త అసహనం కనిపిస్తోంది. పాదయాత్రలో రెండు నిమిషాలు మాట్లాడినంత మాత్రాన పోయేదేం లేదు కదా? జగన్ పాదయాత్ర చేసినపుడు ఎక్కడ ఇలాంటి షరతులు పెట్టలేరు కదా? మరి లోకేష్ పాదయాత్ర చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు. పాదయాత్ర వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమిటి? అధికారం దూరం అవుతుందని ఆందోళన చెందుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయినా చంద్రబాబును అడ్డుకున్నారంటే ఏమైనా అనుకోవచ్చు. లోకేష్ ను మాట్లాడనీయకుండా చేయడం వల్ల ఉచితంగా ప్రభుత్వమే లోకేష్ కు పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుంది.  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎప్పుడైనా ఉందా మరి ఇంత అరాచకంగా వ్యవహరించడం ఏంటి అంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల లోకేష్ కు ప్రజల్లో అభిమానం, సానుభూతి రెండు పెరిగి రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచినా గెలవవచ్చు. లోకేష్ కు ఆ పదవి దక్కవచ్చు. గతంలో జరిగిందే ఇప్పుడు జరగదని గ్యారంటీ ఏమిటని చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: