గూగుల్‌కు చుక్కలు చూపిస్తున్న ఛాట్‌ జీపీటీ?

చాట్ జిపిటి దెబ్బకి జనాలు సొంత మెదడులను వాడటం మానేశారు. రాబోయే కాలంలో ఈ వైపరీత్యం ఎక్కడిదాకా వెళ్తుందో తెలియడం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైన చర్చ. చాట్ జిపిటిని ఇప్పుడు కొన్ని స్కూళ్లు నిషేధించాయి. మన స్కూళ్లలో ఇప్పుడు ట్యాబులు ఇస్తున్నట్లుగా అమెరికాలోని కొన్ని స్కూళ్లలో ఎప్పటినుండో ట్యాబులు, లాప్టాప్ లు ఇస్తున్నారు. వాటిలో చాట్ జిపిటిని అక్కడ నిషేధించారు. ఎందుకంటే సొంత బుర్రలు వాడటం మానేసి ఈ చాట్ జిపిటితో హోంవర్కులు, పోయెమ్స్ ఇవి చేయించడం వల్ల.

అందుకని అమెరికాలోని చాలా చోట్ల ఈ చాట్ జిపిటిని నిషేధించారు. కెనడా, ఫ్రాన్స్ ల్లో కూడా విద్యా సంస్థల్లో దీనిని నిషేధించారు. కానీ దీన్ని వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దానికి సజీవ సాక్షమే తాజాగా అమెరికాలోని కొలంబియాలో కోర్టు తీర్పుకు జడ్జ్ దీని వాడిన ఉదాంతంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది అత్యంత కీలకమైన తీర్పు. అయినా కోర్టు తీర్పు కోసం చాట్ జిపిటిని అడగగానే చాట్ జిపిటి దానికి తగ్గట్టుగా సమాధానం ఇచ్చింది దాన్ని బేస్ చేసుకుని జడ్జిగారు తీర్పునిచ్చారు. కొలంబియన్ జడ్జి చాట్ జిపిటి ను ఉపయోగించి ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.

దాదాపుగా ఆయన 8 తీర్పులు ఇలానే ఇచ్చానని చెప్పుకొచ్చారు ఇవాన్ జూనియర్ అనే ఈ జడ్జిగారు. ఈ ఆర్టిఫిషియల్ బేస్డ్ మైక్రోసాఫ్ట్ నవంబర్ 2022లో రూపొందించిన చాట్ జిపిటి కాస్త పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే స్టోరీస్, సాంగ్స్, లిరిక్స్ ఇంకా లాయర్ ఎగ్జామ్స్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో జడ్జిలు కూడా కోర్టులో వాడేయడం ఈ మధ్యన పెరుగుతుంది. చివరికి రాబోయేటటువంటి రోజుల్లో మనిషి మెదడును ఇది నిర్వీర్యం చేసేస్తుందని కొందరు వాపోతున్నారు. ఏదైనా  సహజంగా జరిగే ప్రక్రియ సహజంగానే జరగాలి గాని దాన్ని కూడా టెక్నాలజీ ఉపయోగించి చేద్దామనుకోవడం వినాశనానికే దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: