జగన్‌.. ఆ విషయంలో అనవసరంగా కెలుక్కున్నారా?

ఏపీ రాజధానిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని దీన్ని కాదని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిందని వైఎస్సార్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో అన్నారు. అయితే సుప్రీం కోర్టులో 23 తారీఖున ఏపీ రాజధానిపై విచారణ జరగనుంది. ఇలా చట్ట సభల్లో మాట్లాడటం కోర్టులను దిక్కారం కాకపోయినా కానీ ఇదే అంశంపై బయట మాట్లాడితే అది కోర్టు దిక్కారం కిందకు వస్తుంది. పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల రాజధానులను ఏర్పాటు చేసుకోవడంలో రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి హక్కు ఉంటుందన్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీలు లేవన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. న్యాయవ్యవస్థ ఎక్కువ చొరవ తీసుకుని దాన్ని ఆపడం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందలేకపోతున్నాయి. ఆర్టికల్ 154 రెడ్ విత్ 163 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర కార్యనిర్వహణ చేతుల్లో ఉంటుందన్నారు. రాజధానిగా ఏ నగరం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం అసమానతల్ని తొలగించేందుకు ఆదేశిక సూత్రాల ప్రకారం.. న్యాయ రాజధాని, ఆర్థిక రాజధాని అని ప్రకటించుకున్నాం. 2021 ఫిబ్రవరి 4న లోక్ సభలో కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాల రాజధానులను నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందన్నారు.

దీనికి గాను న్యాయవ్యవస్థ మీద మీ వ్యాఖ్యల్ని సమర్థించుకునేందుకు మీ వద్ద డాక్యుమెంట్లు ఉంటే సభ ముందు ఉంచాలని రాజ్యసభ అధ్యక్షుడు జగదీష్ దన్ ఖడ్ అన్నారు. న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేటప్పడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారు. న్యాయవ్యవస్థ పరిధి దాటి వ్యవహరించిందని అనడం దానికి కళంకం ఆపాదించడమే అన్నారు. మీరు చెప్పిన మాటలను నిరూపించాలని విజయసాయి రెడ్డికి రాజ్యసభ ఛైర్మన్ సూచించారు. న్యాయవ్యవస్థ ఇచ్చిన ఏ తీర్పు ఆధారంగా మీరు ఈ వ్యాఖ్యలు చేశారో పూర్తి వివరాలు సమర్పించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: