లోకేశ్‌ అనవసరంగా తెలంగాణతో గోక్కుంటున్నాడా?

1994కు ముందు హైదరాబాద్ లో  రాళ్లు రప్పలు ఉండేవని ఇటీవల లోకేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.  వైఎస్సార్ పార్టీ తప్ప ఎవరూ లోకేష్ అన్న మాటలను విమర్శించేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా జనసేన, ప్రస్తుతం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిద్ధంగా లేదు. హైదరాబాద్, తెలంగాణ గురించి కానీ ఒక్క మాట అన్న ఉవ్వెత్తున లేచి నిలబడే బీఆర్ఎస్ నాయకులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇన్ని మాటలు ఒక మాజీ సీఎం కొడుకు అంటుంటే వినబడనట్లు నటిస్తున్నారు.

దీనికి అసలు కారణం బీఆర్ఎస్ కు ఆంధ్రలో కాస్తో కూస్తో ఓట్లు వచ్చే సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక ఏమైనా ఉంటుందా. కానీ లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని మాత్రం మేధావులు, ఇతరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటికే ఇక్కడ చార్మినార్ కట్టారు. ప్రసిద్ధ నగరం.. ఇలాంటి నగరం రాళ్లు రప్పలు ఉన్నాయని ఎలా అంటారని మండిపడుతున్నారు.

చంద్రబాబు కేవలం సైబర్ టవర్స్ కట్టారు. దీన్ని మేం అంగీకరిస్తాం కానీ హైదరాబాద్ కు చరిత్ర లేదు అని అనడం  నైతికత కాదని విమర్శించారు. అంటే రాష్ట్రానికి భవిష్యత్ అని చెప్పుకుంటున్న లోకేష్ లాంటి యువనేత వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోవడం చాలా బాధాకరం.. కొన్ని రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం నోరు మెదపకుండా సైలెంట్ గా ఉంటే అనంతరం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

చంద్రబాబు అనిపించాడా? లేక లోకేష్ కావాలనే అన్నారా..  ఆంధ్రలో లక్ష్యం అధికారంలోకి రావడం. దాన్ని సాధించేందుకు టీడీపీ వేస్తున్న ఎత్తుగడ అని కొందరు అంటున్నారు. మరికొందరు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా టీడీపీకి తెలంగాణలో ఎలాగో ఓట్లు పడవు.. కనీసం ఆంధ్రలో నైనా గెలవాలంటే ఈ మాత్రం విమర్శలు చేయకపోతే ప్రజల మనసును ఆకర్షించమని లోకేష్ భావిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: