ప్రపంచానికి షాక్‌ ఇస్తున్న చైనా ప్రయోగం?

చైనా సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. హలీవుడ్ సినిమా తరహాలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వినూత్నమైన పద్ధతులను స్క్రీన్ పై కాకుండా నేరుగా చేస్తుంది చైనా. ప్రస్తుతం చైనా క్లోనింగ్ చేస్తుంది. అంటే ఒక మనిషిని పోలిన మనిషి రూపాన్ని సృష్టించడం. ముఖాన్ని అచ్చుగుద్దినట్లు తయారు చేయడం. ఇది  మూడు రకాల ఆవుల్ని క్లోనింగ్ చేసింది. ప్రస్తుతం అక్కడ పాలకు కొరత ఉంది. ఆవుల్ని పెంచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

సూపర్ సోల్జర్స్ తరహాలో సూపర్ కంప్యూటర్ తరహాలో ఇది జరుగుతుంది. చైనా శాస్త్రవేత్తలు డెయిరీ ఇండస్ట్రీ మీద చేసిన సంచలన ప్రయోగం అని చెప్పొచ్చు. నార్త్ వెస్ట్ యూనివర్సీటీలో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నెదర్లాండ్ లో పుట్టిన కోస్టిక్ పిజియా బ్రీడ్ కు చెందిన మూడు ఆవుల్ని క్లోన్ చేసి బయట ప్రపంచానికి చూపించారు. మొత్తం 120 చేసినప్పటికీ మూడింటినే మాత్రమే బయటకు చూపిస్తున్నారు.

ఏడాదికి 18 టన్నుల పాలు ఇస్తాయని చెబుతున్నారు. జీవిత కాలంలో 100 టన్నుల పాలు ఇస్తాయని మామూలు ఆవులతో పోల్చుకుంటే 1.7 శాతం ఎక్కువ ఇస్తాయి. అమెరికా తో పోల్చితే 70 శాతం ఎక్కువ ఇస్తాయి. విదేశాల నుంచి ఆవులను దిగుమతి చేసుకోవాలంటే రేట్లు ఎక్కువ అవుతున్నా తరుణంలో చైనా ఇలా సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది.

ఇవి కాకుండా క్లోన్ గేదెలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలను డ్రాగన్ కంట్రీ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటి మీద దృష్టి సారించిన చైనా ఈ ప్రయోగం పూర్తిగా విజయం సాధించి క్షేత్ర స్థాయిలో సక్సెస్ అయితే మరిన్ని ప్రయోగాలు చేపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చైనా ముందు ఆలోచనల వల్ల ఎలాంటి సమస్యలనైనా వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. మరి క్లోనింగ్ ఆవుల ప్రయోగం సఫలమైంది. ఇంకా ఎలాంటి ప్రయోగాలను చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: