చీకట్లో పాకిస్తాన్‌లో.. విదేశీ కుట్రే కారణమా?

పాకిస్తాన్‌లో ఎక్కడ ఏం జరిగినా దానికి విదేశీ కుట్ర ఉందని ఆరోపించడం వారికి అలవాటు. కానీ భారత్‌లోఅలా కాదు కేవలం ఉగ్రదాడులు లేదా ఐఎస్ఐ కుట్ర జరిగినప్పుడు మాత్రమే పాకిస్తాన్ హస్తం ఉందని భారతదేశం గాని ప్రజలు గాని భావిస్తారు. అంతేగాని చీటికిమాటికి చిన్న విషయానికి పెద్ద విషయానికి పాకిస్తాన్ను  నిందించే అలవాటు ఇండియా కు లేదు.

కానీ పాకిస్తాన్ అదే పనిగా భారత్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ భారత్ ను దోషిగా చూపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్లో మరో సంక్షోభం వచ్చింది. గత మూడు రోజులుగా కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సంక్షోభంతో ఏకంగా పార్లమెంట్ ను మూడు రోజులు మూసివేశారు.

దీనిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ మాట్లాడుతూ దీని వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. పాకిస్థాన్‌లో విద్యుత్ సంక్షోభం ఏర్పడితే దానికి కారణం సైన్యం అవుతుంది. లేదా అక్కడి ఐఎస్ఐ కారణం కావాలి. ఎక్కడో ఉండే విదేశాలు పాకిస్తాన్‌లో కరెంటు సంక్షోభానికి కారణం ఎలా అవుతాయో తెలియడం లేదు. పాకిస్తాన్ విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఈ విద్యుత్ సంక్షోభానికి కారణం విదేశీ పాత్ర దాగుంది అన్నారు. దానిని వెలికి తీయడానికి ఓ కమిటీని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారంటే దీని వెనుక వారికి ఉన్న సమస్యను ఇతరులపై నెట్టేయడం.  దేశ ప్రజల్లో తమ తప్పు లేదని ఇదంతా విదేశీ కుట్రే అని చెప్పుకోవడానికి బాగుంటుందని పాక్ ప్రభుత్వ అభిప్రాయం. అయితే ఇప్పటికే పాకిస్తాన్‌లో  ఆర్థిక సంక్షోభం తో కనీసం గోధుమపిండి కూడా దొరకని పరిస్థితి. గోరుచుట్టు రోకలి పోటు అన్న చందంలా ఇప్పుడు కరెంటు సంక్షోభము పాకిస్తాన్ ను వెంటాడుతుంది. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఆ
 దేశ ప్రజలు సమస్యల బారిన పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: