పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

సిక్కిం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఒకరిని కంటే ఒక ఇంక్రిమెంట్ ఇద్దరినీ కంటే రెండు ఇంక్రిమెంట్ లని ఒక ప్రకటన చేసింది. మాతృత సెలవులు సంవత్సరానికి పెంచింది. అక్కడ జనాభాలో  జనన మరణాలు స్త్రీ పురుషుల్లో తీవ్రమైన భేదం కారణంగా అలాగే జనన రేట్లు పడిపోవడంతో సిక్కిం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ సంతాన ఉత్పత్తి రాష్ట్రంలో పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.

దీని ద్వారా పెళ్లి కాని వారికి పెళ్లి అయిన పిల్లలు కాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి మంచి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనితో పాటు చిన్నారులకు గర్భిణులకు ప్రసవానంతరం ఏడాది పాటు ఒక ఆయాని కూడా నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీరికి నెలకు 10,000 చొప్పున ఇస్తామని కూడా చెప్పారు. సంతానోత్పత్తి రేటు పడిపోతుందని  పునరుద్ధరించడానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అంతేకాకుండా ఒకరి కంటే ఎక్కువ మందికి సంతానాన్ని ఇచ్చే మహిళా ఉద్యోగులకు ఎక్కువ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని చెప్పింది. సంతానం కోసం ఇబ్బంది పడుతున్న జంటలకు ప్రభుత్వమే ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సంతానోత్పత్తి సిక్కింలో  1 శాతానికి పరిమితమైంది. ఆ రాష్ట్ర జనాభా కేవలం 7 లక్షలుగా ఉంది. కాబట్టి జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెడుతుంది. ఇదే విధంగా 30,35 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటే ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే పరిస్థితి ఉంటుంది.  ఏదేమైనా భారత్ లో అధిక జనాభా తో ఇబ్బందులు పడుతుంటే సిక్కింలో వింత పరిస్థితి ఉందనే చెప్పవచ్చు. భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటే పైసలిస్తామని, పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్స్ ఇస్తామని, స్కూల్స్, కాలేజీలో, చదివి పిస్తే డబ్బులు ఇస్తామని చెప్పే రోజులు వస్తాయేమో. ఏదేమైనా సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: