జగన్‌కు అండగా నిలిచిన కేరళ హైకోర్టు తీర్పు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. జగన్ సర్కార్ ఈ పాదయాత్రలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. తను చేసినప్పుడు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించిన జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన పాదయాత్ర బస్సు యాత్ర చేద్దామనుకుంటే అడ్డుకుంటున్నారు. దీనికి ఒక కారణం చెబుతున్నారు. టిడిపి బహిరంగ సభలలో వరుసగా జరిగిన ఘటనలు అందులో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో పాదయాత్రలపై జగన్ ప్రభుత్వం నిషేధం విధించింది. రోడ్ షో ల పై పూర్తిగా నిషేధాజ్ఞలు చేపట్టారు. ఈ సందర్భంగా కేరళ లో హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ప్రభుత్వం చూపెడుతోంది.

ఒకానొక సందర్భంలో కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. రోడ్ షోలు గాని బహిరంగ సభలు గాని సామాన్య ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ కు ట్రాఫిక్ డైవర్షన్‌కు  సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి. అలాంటి ఇబ్బందులు కలిగే ఏ పాదయాత్ర అయినా గాని నిర్వహించడానికి వీలులేదని ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పుని జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు ప్రతిపక్షాలకు సూచిస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు మాత్రం మీరేమో స్వేచ్ఛగా పాదయాత్ర ఓదార్పు యాత్ర అని రాష్ట్రంలో వందల రోజులు తిరగచ్చు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రజా సమస్యలపై గళ మెత్తడానికి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పాదయాత్ర చేయాలనుకుంటే మాత్రం నిరాకరిస్తారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఈ పాదయాత్రల గురించి రాష్ట్రంలో తీవ్రంగానే చర్చ నడుస్తుంది.లోకేష్ పాదయాత్రకు అనుమతి వస్తుందా రాదా పవన్ బస్సు యాత్రకు అంగీకారం తెలుపుతారా ఉండదా అనే చర్చలతో వాడి వేడిగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. పాదయాత్రకు అనుమతిస్తుందా ఇవ్వదా? ఒకవేళ ఇస్తే ఎలాంటి షరతులతో ఇస్తుందనేది త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: