భారత్‌తో పోటీపడే సత్తా పాకిస్తాన్‌కు ఉందా?

నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు పాకిస్తాన్ వైఖరి ఉంది. ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుపోతూనే భారతదేశంతో మేము పోటీ పడుతున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. అయినా ప్రపంచ దేశాలను ఆర్థిక సాయం అడుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు కలిపి వరద సాయం కింద 9 బిలియన్ డాలర్లను అందజేశారు. ఇందులో గతంలో లాగా పూర్తిగా వరద సాయం కాకుండా 80 శాతం అప్పుగా ఇచ్చారు. వీటిని ఆయా దేశాలకు మళ్ళీ పాకిస్తాన్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందులా కాకుండా పాకిస్తాన్ ఆచితూచి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్తో 780 మిలియన్ డాలర్ల వ్యాపారం కొనసాగిస్తుంది. అదేంటంటే కేవలం డ్రగ్స్ మాఫియా ద్వారా 70 నుంచి 80 మిలియన్ డాలర్ల  వరకు డ్రగ్స్ సరఫరాకు ఇవి డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది. డ్రగ్స్ మాఫియా వల్ల పాకిస్తాన్ కు ఒక రకమైన లాభమే చేకూరుతుంది. ఆఫ్గన్ నుంచి సరఫరా అవుతున్న డ్రగ్స్ ను వివిధ ఉగ్రవాద తీవ్రవాదం ముఠాలకు సరఫరా చేస్తూ వారి నుంచి ఆయుధాలను పాకిస్తాన్ సేకరిస్తుంది. ఇది పాకిస్తాన్ కు అలవాటుగా మారింది.

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ వాటితో ఆయుధాలను సేకరించుకుంటూ ఆయా తీవ్రవాద ముఠాలకు  సరఫరా చేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్టు  నాటకాలు ఆడడం పాకిస్తాన్‌కే  చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద భావజాలం ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే పాకిస్తాన్ అని దేశాలు చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ మేము మాత్రం నీతిమంతులం మాకు ఎలాంటి తీవ్రవాద ముఠాలతో సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్న అని చెప్పి ప్రపంచ దేశాల నుంచి డబ్బులు తీసుకొని అందులోంచి కొన్ని నిధులను డ్రగ్స్ కు వినియోగించుకుంటున్నారంటే పాకిస్థాన్ ను ఏమనాలి? అయినా అలాంటి దేశానికి ఆర్థిక సాయం చేస్తున్నటువంటి దేశాలు కూడా ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: