చైనాకు చెప్పేందుకు ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?

తీవ్రవాదం ఎక్కువగా ఉండి, అదికూడా విదేశీ శక్తుల హస్తం ఉన్నచోట కేంద్రమే పరిపాలించడం ముఖ్యం. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఎక్కువైతే ఇతర దేశాలు వాటిని ఆసరాగా చేసుకుని అల్లర్లు సృష్టిస్తాయి. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. స్థానికంగా అల్లర్లు సృష్టించి, దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తాయి విదేశీ శక్తులు. దీనికి సజీవ సాక్ష్యం జమ్మూ అండ్ కాశ్మీర్. అందుకే రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ 370 ని రద్దు చేసి లదాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.

ఈ ఎత్తుగడతో అక్కడ ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా పోయింది. అలాగే ఈ నిర్ణయం జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంత అభివృద్ధికి దోహదం అవుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు బెంగాల్ లోని కొంత భాగాన్ని విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంచలన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.దేశ సార్వభౌమాధికారం, దేశ రక్షణ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా పశ్చిమబెంగాల్ లోని చైనా సరిహద్దు గల కూచ్ బెహార్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనుంది. ఈ ప్రాంతం టోర్స నదికి తూర్పు భాగాన ఉంది. దీనిని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం సిలువురి కారిడార్ లేదా చికెన్ నెక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ కూచ్ బెహార్ ప్రాంతం భారతదేశంలోని మిగతా రాష్ట్రాలను అలాగే ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం. ఇది దేశంలోనే అత్యంత ఇరుకైన కారిడార్. ఇది కేవలం 17 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.

ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే భారతదేశ నుంచి 8 ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయవచ్చని చైనా భావిస్తోంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దేశాలకు ఇది సరిహద్దుగా ఉంటుంది. పశ్చిమబెంగాల్, అస్సాం, భూటాన్, బంగ్లాదేశ్ లకు వాణిజ్యం, పర్యాటకం కోసం ఈ కూచ్ బెహార్ ప్రాంతం ముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశాన్ని విడగొట్టాలని చూసే గ్యాంగులు ముఖ్యంగా ఈ ప్రాంతం పైనే దృష్టి కేంద్రీకరించాయి. అటు చూస్తే బెంగాల్ ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించకోవడం లేదు. అందువల్ల దేశాన్ని విడగొట్టే ముఠాలను గ్యాంగులను అంతం చేయడానికి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే కూచ్ బెహార్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: