పీకల్లోతు కష్టాల్లో పాక్.. మరో శ్రీలంక అవుతుందా?
విదేశీ నిల్వలు తగ్గిపోవడం, నిత్యాసరధరలు ఆకాశాన్ని అంటడంతో.. పంచదార, నూనె, నెయ్యి లాంటి నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. 15 కేజీల గోధుమపిండి బస్తా ఖరీదు 2,050రూపాయలు ఉందక్కడ. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి లాంటి వస్తువుల ధరలు 25శాతం నుంచి 62శాతం కు పెరిగాయి. నిత్యవసరాలపై సబ్సిడీ కూడా ఎత్తేయడంతో ప్రజలకు ధరల సమస్య ఎక్కువైంది. ద్రవ్యోల్బణ రేటు వారానికి 1.0శాతం పెరుగుతుంది.
పాకిస్తాన్ లో ఉపయోగించే వంటనూనె 90%దిగుమతుల ద్వారా లభిస్తుంది. విదేశీ నిలువలు తక్కువగా కేవలం 3వారాలకు సరిపడానే ఉండడంతో,వంటనూనెను అత్యవసర జాబితాలో నుంచి తొలగించారు. అంతేకాకుండా మార్చ్ లో రంజాన్ మాసం ప్రారంభమవుతుండడంతో నెయ్యి ఇంకా నూనెల దారులు క్రమబద్ధీకరించాలని అక్కడ డిమాండ్ ఎక్కువవుతుంది. పాకిస్తాన్ లో రూపాయి విలువ కూడా క్రమంగా క్షీణించి పోయింది. డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ 227 రూపాయలకు పడిపోయింది.
విదేశీ మారక ద్రవ్యం నిలువలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై 8 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2016లో ప్రభుత్వాన్ని మాకు అప్పగించినప్పుడు విదేశీ మారకద్రవ్య నిలువలు 2,400 బిలియన్ డాలర్లు ఉండేవి. అవి కూడా ఇప్పుడు మా దగ్గర లేవని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మూడు శాతం కన్నా తక్కువ ఉందని పాకిస్తాన్ మరొక శ్రీలంక కాబోతుందని ఆయన చెప్పారు.