ఆ విషయంలో భారత్‌ ఇంకా వెనుకబడే ఉందా?

వైద్యవిద్య పేదవారికి అందని ద్రాక్ష అవుతున్న నేపథ్యంలో  వాళ్లకు ఒక వరంగా ప్రతి జిల్లాకో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలని.. అలాగే వైద్యుల సంఖ్య పెంచడం కోసమని మెడికల్ సీట్లు కూడా పెంచాలనీ,  కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేటు వైద్య విద్య ఖర్చులు పెరగడంతో, ప్రైవేట్ కాలేజీలో చదువుకుని డాక్టర్లైన వాళ్ళు తిరిగి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి రెండింతలు వైద్యం కోసం వచ్చే పేషంట్ల దగ్గర లాగుతున్న వైనంతో కేంద్ర ప్రభుత్వం  వైద్య విధానంలో కొంత మార్పు తీసుకురావడానికి చూస్తుంది.

వైద్య విద్య నేర్చుకున్న వాళ్లలో పీజీల కోసం విదేశాలు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు కొంతమంది అయితే, గొప్పగా చెప్పుకోవడానికీ తమ స్టేటస్ సింబల్ కోసమని ఈ వైద్య విద్యను నేర్చుకునే వాళ్ళు మరి కొంతమంది.  ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా ముందు వరుసలో వాళ్ళే ఉంటున్నారు. వీళ్లు మెడికల్ ప్రాక్టీస్ కన్నా ఎక్కువగా స్టేటస్ కోసమనో, సంపాదన కోసమో చూస్తున్నారు కానీ  అవసరమైన వాళ్ళకి సరైన వైద్యాన్ని అందించకపోగా  వాళ్లు సామాన్య జనాన్ని పిండేస్తున్నారు.

ఈ పైన చెప్పుకున్న రెండు వర్గాలు కాకుండా, బడుగు బలహీన వర్గాల నుండి, పేద మధ్య తరగతి వారి నుండి వైద్యులైన వాళ్ళు  మాత్రమే పేద ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారికి సరైన వైద్యాన్ని వీలైనంత తక్కువ ఖర్చులో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి ప్రభుత్వ  ఆసుపత్రుల్లో వైద్య అవకాశం రాకపోతే ప్రైవేట్ ఆస్పత్రిలోనైనా సరే వారు వైద్యం చేస్తున్నారు. చివరికి ఈ మధ్య వస్తున్న మెడికల్ యాప్ ల ద్వారా ప్రజల వైద్య అవసరాలు తెలుసుకొని వారి ఇంటికే నేరుగా వెళ్లి వీలైనంత తక్కువ ఖర్చులో  వారికి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ మూడో వర్గం వారు తప్ప  పైన చెప్పిన మిగిలిన  రెండు వర్గాలకు సంబంధించిన వారి చదువు మాత్రం వాళ్లకు తప్ప సాధారణ ప్రజలకు అందని పరిస్థితి అయితే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: