మీ ఆధార్‌ కార్డు: ఈ జాగ్రత్త తీసుకోకపోతే కొంప కొల్లేరే?

ఆధార్ కార్డు. ఇది మన అస్తిత్వ చిరునామా.. ఇప్పుడు దేశంలో ఏ ప్రభుత్వ కార్యక్రమానికైనా.. ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ముందు కావాల్సింది ఆధార్‌ కార్డే. అంతే కాదు.. అనేక దరఖాస్తుల్లో ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు. అలాగే ఆధార్ కార్డు జీరాక్స్ కాపీ అటాచ్ చేయమని చెబుతుంటారు. అయితే.. ఇలాంటి కీలకమైన ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.. ఆధార్‌ కార్డు జీరాక్స్ లను వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదు.

అంతే కాదు..ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్‌ నెంబర్‌ను సామాజిక మాధ్యమాలు, ఇతర బహిరంగ వేదికల్లో ప్రదర్శించడం, పంచుకోవడం చేయకూడదు. అలాగని ఆధార్ వినియోగంలో ధైర్యంగానే ఉండొచ్చు. ఆధార్‌ను ధైర్యంగా ఉపయోగించుకోచ్చు. అయితే ఆధార్‌ కార్డు వినియోగాన్ని గమనిస్తూ ఉండటం మంచిది.  ఆధార్‌ నెంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆధార్‌ కార్డు  ఓటీపీని ఎవ్వరితో పంచుకోకూడదు.

ఆధార్‌ కార్డు  ఆధారంగా సైబర్ నేరాలు పెరిగినందువల్ల.. చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎం-ఆధార్‌ పిన్‌ నెంబర్‌నూ ఎవ్వరికీ చెప్పకూడదు. మనం మన  గత ఆరునెలల ఆధార్‌ వినియోగాన్ని యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో, ఎం-ఆధార్‌ యాప్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు కూడా. ఆధార్‌ ధృవీకరణ జరిపిన ప్రతిసారీ ఆ విషయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈమెయిల్‌ ద్వారా మీకు  సమాచారం ఇస్తుంటుంది. దీన్ని చెక్‌ చేసుకోవాలి.

ప్రతి ఆధార్‌కార్డుదారు తన ఈమెయిల్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవడం చాలా మంచిది. ఓటీపీ ఆధారిత ధృవీకరణ ద్వారా పలు సేవలు అందుకోవడానికి వీలు ఉంటుంది. అందుకే ఆధార్‌ కార్డును మొబైల్‌ నెంబర్‌ను ఆధార్‌నెంబర్‌తో జత చేసుకోవడం మంచిది. ఆధార్‌ నెంబర్‌ కావాలని ఏదైనా సంస్థ అడిగితే.. దాన్ని ఎందుకోసం అడుగుతున్నదీ స్పష్టంగా తెలుసుకోవాలి. ఆధార్‌ నెంబర్‌ పంచుకోవడానికి ఇష్టం లేకపోతే వర్చువల్‌ ఐడీని జనరేట్‌ చేసుకొని వాడుకోవచ్చు కూడా.  దీన్ని యూఐడీఏఐ వెబ్‌సైట్‌, మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా జనరేట్‌ చేసుకోవచ్చు. ఇక ఆధార్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: