చైనా, పాకిస్తాన్‌తో భారత్‌కు యుద్ధం తప్పదా?

యుద్ధంలో పోరాడడానికి భారత్ కు తగినన్ని ఆయుధాలు ఉన్నాయి. వెన్నుచూపని ధైర్యం ఉంది. పాకిస్తాన్, చైనా భారత్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి.. కానీ దానికి భారత్ సిద్ధంగా లేదు..  ఇలా వ్యాఖ్యానించింది మరెవరో కాదు రాహుల్ గాంధీ. పోరాడడం భారత దేశానికే కొత్తేమీ కాదు, ఒక పక్క దేశంలో తీవ్ర వాదులు, నక్సలైట్లు వారికి మద్దతునిచ్చే మానవ పౌర హక్కుల సంఘాల వీరందరితో నిత్యం చేసేది అదే.  కానీ భారత యుద్ధ సంపత్తి పై రాహుల్‌ గాంధీపై మరెందుకో అంత సందేహం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్ చైనా కలిసి భారత్ పై యుద్ధానికి వస్తే పోరాడడానికి భారత్ సిద్ధంగానే ఉంది. అందు కోసం భారత్ ప్రిపేర్ అవుతుంది కూడా. కానీ మన దేశంలోనే ఉంటూ మన దేశాన్ని మన దేశ శక్తిని అనుమానించడం ఎందుకన్న విమర్శలు వస్తున్నాయి. చైనా కాంగ్రెస్‌కు మిత్ర దేశమే అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి చైనా ఏమైనా ఈయనతో చెప్పిందా భారత ప్రభుత్వం పై యుద్ధానికి వస్తామని అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాల‌ దృష్టి చైనాపై నుండి మళ్ళాలంటే చైనా భారత్ పై యుద్ధానికి  రావాలేమో.. గతంలో డోక్లాన్, గల్వాన్‌, తవాంగ్ లలో భారత్ చైనాకు చేసిన పరాభవం గుర్తు లేదా.. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మళ్ళీ యుద్దానికి రావడానికి చైనా ఎలా ప్రయత్నిస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. చైనా భారత్‌పై యుద్ధానికి వస్తే బతికి బట్ట కడుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ఏదేమైనా ఈసారి చైనా భారత్ పై యుద్ధానికి వస్తే భారత్ మాత్రం చైనాను కోలుకోలేని దెబ్బ కొడుతుందని చెప్పొచ్చు.  కానీ భారత్ లో ఉన్నవాళ్లు భారత్ గొప్ప తనాన్ని గుర్తించకపోయిన పర్లేదు గాని భారతదేశ శక్తిని తక్కువ చేసేలా మాట్లాడటం మాత్రం న్యాయమూ కాదు.. సమంజసమూ కాదంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: