2024 ఎన్నికల కోసం జగన్ మాస్టర్‌ ప్లాన్‌.. మామూలుగా లేదుగా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లకు 151 సీట్లు గెలుచుకుని జగన్ ప్రభంజనం సృష్టించాడు. అయితే.. ఈసారి అంతకు మించి సత్తా చాటాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. 175కు 175 సీట్లూ మనమే గెలవాలని పార్టీ నేతలకు టార్గెట్ పెడుతున్నారు. ఇందుకు ఏడాదిన్నర ముందు నుంచే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. నిన్న వైసీపీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో భేటీ అయిన సీఎం జగన్.. తన మాస్టర్‌ ప్లాన్ వారికి వివరించారు.

 క్షేత్ర స్థాయిలో పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడం ద్వారా అనుకున్న లక్ష్యం సాధించాలని సీఎం జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రజలందరినీ 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ గృహసారథులుగా ఉంటారని సీఎం జగన్ వివరించారు. వీరంతా పార్టీ సందేశాన్ని చేరవేయడం, పబ్లిసిటీ మెటీరియల్ అందించడం వంటి కార్యక్రమాలు చూస్తారని సీఎం జగన్ అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారన్న సీఎం జగన్.. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారని తన ప్లాన్ వివరించారు. మొత్తంగా యాభై ఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో 5 లక్షల మందికి పైగా గృహసారథులు ఉంటారని సీఎం జగన్తెలిపారు.  ఈనెల 20 లోపు ఎంపిక చేస్తామని జగన్ పార్టీ నేతలకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45 వేల మంది కన్వీనర్లు ఉంటారని సీఎం జగన్ వివరించారు. ముందుగా రాష్ట్రంలోని దాదాపు 15వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్ల ఎంపికను ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు.

ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు వీరిని ఎంపిక చేయాలని సీఎం జగన్ అన్నారు. గృహ సారథులు, కన్వీనర్లకు ఉచిత జీవిత బీమా ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారని సీఎం జగన్ తెలిపారు. ఎలాగైనా 175కి 175 సీట్లు గెలిచేలా పార్టీ నేతలంతా కృషి చేయాలని జగన్ అంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: