కేటీఆర్ చూస్తున్నారా? ఆ నేరాలు తెలంగాణలోనే ఎక్కువట?

ఇప్పడంతా మొబైల్ యుగమే.. ఏ పని చేయాలన్నా మొబైల్ ఆన్ చేయాల్సిందే.. అయితే.. ఈ ట్రెండ్ కాస్తా సైబర్ నేరాలకు అవకాశం ఇస్తోంది. అనేక రూపాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. వాళ్లు మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. నైస్‌గా ఎకౌంట్లో సొమ్ములు కాజేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఆన్‌లైన్‌ ఆర్ధిక మోసాల నమోదులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందట. 2021లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 14,007 కేసులు నమోదైతే.. ఒక్క తెలంగాణలోనే 2003 కేసులు రిజిష్టర్ అయ్యాయట. ఇది కేంద్రం పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో చెప్పిన మాట.

కేంద్రం చెప్పిన లెక్కల వివరాల్లోకి వెళ‌ితే.. తెలంగాణలో 2010లో 282 కేసులు నమోదు అయ్యాయి.  2020లో ఈ సంఖ్య 3,316కి చేరుకుంది. 2021లో ఈ కేసులు భారీగా పెరిగాయని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో 2019లో 172 మందిని ఈ నేరాల విషయంలో అరెస్టు చేశారు.  2020లో 582 మందిని, 2021లో 743 మంది ఆన్‌లైన్‌ మోసగాళ్లని పోలీసులు అరెస్ట్ చేశారు. శిక్షల్లో మాత్రం భారీ తేడా ఉందన్న కేంద్రం.... 2010లో ఇద్దరికి, 2020లో 202 మందికి, 2021లో 3కేసుల్లో మాత్రమే శిక్షలు పడినట్లు పేర్కొంది.

ఇక ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రతి ఏటా పెరుగుతున్నాయని కేంద్రం చెప్పింది. లోకసభలో ఓ ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నమోదు అవుతున్న ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు యేటా పెరుగుతూ వస్తున్నాయని కేంద్రం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో 2019లో 703 కేసులు నమోదు అయ్యాయి. 2020లో 764కి పెరిగాయి... 2021లో 352 కేసులు నమోదైనట్లు కేంద్రం చెబుతోంది. ఇక ఏపీలో శిక్షల విషయానికి వస్తే.. 2019లో ఒక్క కేసులో కూడా శిక్ష పడలేదట. 2020లో 2 కేసుల్లో... 2021లో 3 కేసుల్లో మాత్రమే శిక్ష పడినట్లు కేంద్రం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: