మునుగోడు ఎన్నికతో ఆ జిల్లా పంట పండిందిగా?

మునుగోడు ఉపఎన్నికతో నల్గొండ జిల్లా పంట పడింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో ఆ జిల్లాకు భారీగా లబ్ది చేకూరబోతోంది. రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని టీఆర్ఎస్‌ మంత్రులు చెబుతున్నారు. మిషన్ భగీరథ కోసం కూడా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని టీఆర్ఎస్‌  మంత్రులు చెబుతున్నారు. సీఎం కేసిఆర్ గారి దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందని.. కొంతమంది కావాలనే కిస్తిలకు కూడా డబ్బులు అడుగుతున్నారని టీఆర్ఎస్‌ మంత్రులు చెబుతున్నారు.

నల్గొండ జిల్లాలో 20 కోట్లు ఒక్కో నియోజక వర్గానికి ఇచ్చామని 83 కోట్లు పి ఆర్ రోడ్ల నిర్వహణ కింద ఖర్చు చేశామని.. 103 కోట్లు సీసీ రోడ్లకు ఖర్చు చేశామని టీఆర్ఎస్‌ మంత్రులు చెప్పారు. మిషన్ భగీరథ కు అత్యధిక నిధులు ఇక్కడే ఇచ్చే ఫ్లోరైడ్ లేకుండా చేశారని.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనే ఇది చెప్పిందని.. గతంలో కూడా జిల్లా, నియోజక వర్గం స్థాయిలో సమీక్ష చేసి మరిన్ని నిధులు ఇచ్చామని వారు వివరించారు.

గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ట్రాక్టర్ మీద ఒక్కో గ్రామంలో 20 నుంచి 25 లక్షలు సర్పంచ్ లు సంపాదిస్తున్నారని.. ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీ ఆదాయం పెరిగిందని.. ముఖ్యమంత్రి దూర దృష్టి వల్ల ఇది సాధ్యం అయ్యిందని.. కొన్ని చోట్ల సర్పంచులు ఆదాయాన్ని మళ్లించి కిస్తీలకు డబ్బులు రావడం అంటున్నారని  టీఆర్ఎస్‌ మంత్రులు  తెలిపారు. కొన్ని గ్రామ పంచాయతీలలో పొడి చెత్త, తడిచెత్తను వేర్వేరు చేసి ఎరువు తయారు చేసి ఆదాయం 5 నుంచి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని.. పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలు బాగా సంపాదిస్తున్నాయని  టీఆర్ఎస్‌ మంత్రులు వివరించారు.

పంచాయతీ రాజ్ రోడ్లకు పి.ఎం.జి.ఎస్. వై కింద 296.65 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లాకు మంజూరు చేశామని... సి.ఆర్.ఆర్ కొండ 19 కోట్ల రూపాయలు మంజూరు చేశామని.. 81 కోట్లు రోడ్ల నిర్వహణకు ఇచ్చామని.. సీసీ రోడ్ల కోసం 103 కోట్ల రూపాయలు ఇచ్చామని ఇలా నల్గొండ జిల్లాకు రాష్ట్రంలో అత్యధికంగా 1200 కోట్ల రూపాయిలు మంజూరు అయ్యాయని  టీఆర్ఎస్‌ మంత్రులు  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: