అసలు విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏం జరుగుతోంది?

విజయవాడ విమానాశ్రయం నుంచి నల్లధనం అక్రమంగా  రవాణా అవుతున్నట్లు ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా విమానాశ్రయాల భద్రతను సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు చూసుకుంటారు. ఈ దళాలు కేంద్రం ఆధీనంలో ఉంటాయి. కానీ.. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మాత్రం సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు లేరు.. ఇక్కడ రాష్ట్ర పోలీసులే భద్రత వ్యవహారాలు చూస్తున్నారు. అయితే కావాలనే.. ఇక్కడ సీఐఎస్‌ఎఫ్‌ భద్రతను వద్దన్నారని.. కుట్ర పూరితంగానే కేవలం రాష్ట్ర పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పందించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి నల్లధనం అక్రమంగా  రవాణా అవుతున్నట్లు స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇంతవరకు సీఐఎస్‌ఎఫ్  భద్రత ఈ విమానాశ్రయంలో ఏర్పాటు చేయలేదో తెలుసుకుంటానని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ఏపీ రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలకు భిన్నంగా గన్నవరంలో రాష్ట్ర పోలీసుల భద్రత ఎందుకు ఉందనే విషయాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

లిక్కర్ స్కాం విషయంలో విజయవాడ విమానాశ్రయం నుంచి నగదు తరలించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ విషయమై తాను సంబంధిత శాఖ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తాననని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. లిక్కర్ స్కాంతో ఏపీ రాష్ట్రానికి సంబంధం ఉందా..? లేదా..? అనేది త్వరలోనే తేలుతుందని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రెండు వేల రూపాయల నోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చలామణిలో లేవని... కేవలం ఎన్నికల సందర్భంలోనే ఈ నోట్లు బయటకొస్తున్నాయనే విషయపైనా రిజర్వు బ్యాంకు నుంచి వివరాలు కోరుతానని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

అన్నమయ్య బ్యారేజీ కొట్టుకుపోయి ఏడాది అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని కూడా బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ , జనసేన భాగస్వామ్యం ఒక్కటే ప్రజల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయమని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు. రాబోయే కాలం బీజేపీ-జనసేన పార్టీలదేనని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: