విశాఖ కేంద్రంగా వైసీపీ డెవలప్‌మెంట్‌ మోడల్‌?

విశాఖ కేంద్రంగా వైసీపీ డెవలప్‌మెంట్‌ మోడల్‌ను రెడీ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన సెక్టార్లను ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ.. రాష్ట్రానికి ఉన్న అవకాశాలను దృష్టిపెట్టుకొని ఏ పరిశ్రమ స్థాపిస్తే బాగుంటుందో వాటిపై ప్రధానంగా ఫోకస్‌ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. పెట్రో కెమికల్‌కు సంబంధించి ఆంధ్రరాష్ట్రానికి ఉన్న అవకాశాలను ప్రదర్శించే అవకాశం దొరికిందంటున్నారు.  

విశాఖపట్నం, కాకినాడకు సంబంధించి పీసీపీఐఆర్‌ కారిడార్‌ దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్‌ కారిడార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 640 చదరపు కిలోమీటర్ల విశాఖ, కాకినాడ పీసీపీఐఆర్‌ దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా కూడా ఉంది. అందుకే జగన్ సర్కారు దానిపై కూడా ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మేజర్‌గా రాష్ట్రానికి ఉన్న పోర్టులెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసి తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

ఇటీవలే రామాయపట్నం పోర్టుకు సీఎం శంకుస్థాపన కూడా చేశారు. అక్కడ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే భావనపాడుకు సంబంధించి రైతులతో కూడా మాట్లాడారు.. అక్కడ త్వరలోనే భూసేకరణ అంశాన్ని క్లియర్‌ చేసేందుకు అధికారులు జోరుగా పని చేస్తున్నారు. దీంతో పాటు మచిలీపట్నంలో బందర్‌ పోర్టుకు సంబంధించి కోర్టు కేసులు కూడా క్లియర్‌ అయిపోయాయి. దానికి కూడా త్వరలోనే ఫౌండేషన్‌ వేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

ఏపీలో 10 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణం కూడా జరుగుతున్నాయి. మరో 5 హార్బర్లకు నిర్మాణం జరగాల్సి ఉంది. రామాయపట్నం పోర్టుకు మొదటి షిప్‌ 2023 డిసెంబర్‌ నాటికి తీసుకురావాలని సీఎం జగన్ టార్గెట్‌ గా పెట్టుకున్నారు. 2024 జనవరి నాటికి మొదటి షిప్‌ తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు.  జనవరిలో జువ్వెలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: