ఇది జగన్‌ తెచ్చి పెట్టుకున్న తలనొప్పేగా?

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్రం ఎన్నికల సంఘం తేల్చి చెప్పడం ఇప్పడు సంచలనంగా మారింది. పార్టీలకు శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు వర్తించవని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలన్న కేంద్ర ఎన్నికల సంఘం.. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్య వ్యతిరేకమని స‌్పష్టం చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ ఎంపికైనట్లు వచ్చిన వార్తలపై ఈసీ ఇలా స్పందించింది.

శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నియమాలకు విరుద్ధమని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు వైకాపా ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు పంపింది. ఈ విషయంపై అనేక సార్లు లేఖలు రాసినా వైసీపీ పట్టించుకోలేదని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైసీపీ ప్రధాన కార్యదర్శిని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే..ఇది జగన్ తెచ్చి పెట్టుకున్న తలనొప్పిగా అర్థమవుతుంది. అసలు వైసీపీలో జగన్‌కు ఎదురు ఉందా.. జగన్‌ మాట ఎదురు చెప్పే దైర్యం ఉందా.. పోనీ పార్టీలో వర్గ పోరు ఉందా.. మరి అలాంటప్పుడు శాశ్వత అధ్యక్షుడు అంటూ ప్రత్యేకంగా ఎందుకు నియమించుకోవాలి. అసలు దేశంలో ఏ పార్టీకీ లేని ఈ శాశ్వత అధ్యక్షుడు హోదా దక్కించుకోవాలని సీఎం జగన్ ఎందుకు కోరుకున్నారు. ఇది జగన్ ఆలోచనా.. లేక.. ఆయన మెప్పు కోసం పార్టీ నేతలు చేసిన తప్పిదమా?

అసలు శాశ్వత అధ్యక్షుడు అన్న హోదాతో జగన్‌కు వచ్చే అదనపు ప్రయోజనం ఏంటి.. ఇలా ఆలోచిస్తే.. ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనాలేమీ లేవు.. ఇప్పుడు కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ ఉత్తర్వులు వల్ల.. వైసీపీలో ప్రజాస్వామ్యం కరవు అన్న సంకేతాలు వెళ్తాయి. మరి ఈ వివాదాన్ని వైసీపీ ఎలా పరిష్కరించుకుంటుందో.. అబ్బే అసలు అలాంటి ఎన్నికే జరగలేదని చెప్పి.. తప్పించుకుంటుందా.. లేక.. మరేదైనా వాదన ముందుకు తెస్తుందా.. అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: