ఆ ప్రాజెక్టులపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్‌?

రాష్ట్రంలో విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో సాగుతున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌పై జగన్‌ దృష్టి సారించారు. బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్ ఆరా తీశారు. ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణాలతో చేపడుతున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ.25,497.28 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువుల అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లోనూ అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువులపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు సూచించారు.

ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని కూడా సీఎం జగన్  సూచించారు. ఈ చెరువులన్నింటినీ కూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందని సీఎం జగన్ అన్నారు.

ఈ అంశంపై ఒక సమగ్రమైన అధ్యయనం చేయాలని సీఎం జగన్ సూచించారు.  ఈప్రాజెక్టును చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం.. ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో దీన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లు  పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు  సూచించారు. విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో ప్రాజెక్టులు చేపట్టడమే కాదు.. సకాలంలో వాటిని పూర్తి చేస్తేనే మంచి ఫలితాలు ప్రజలకు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: