తిరుమలలో ఆ హీరోయిన్‌ రచ్చ రచ్చ.. ఏమైందంటే?

తిరుమలలో తన పట్ల టీటీడీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని.. స్వామి వారి దర్శనానికి రూ. 10 వేలు డిమాండ్ చేశారని.. ఉత్తరాదికి చెందిన హీరోయిన్‌ అర్చనా గౌతమ్‌ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. టీటీడీ సిబ్బంది తనను దర్శనానికి అనుమతించకుండా వేధిస్తున్నారని.. అదేమంటే రూ. 10 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆ వీడియోలో ఆరోపించారు. అంతే కాదు.. ఏపీ సీఎం ఈ సిబ్బందిపై చర్య తీసుకోవాలంటూ ఆ హీరోయిన్‌ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

అయితే.. ఈ అంశంపై టీటీడీ స్పందించింది. అసలేం జరిగిందో వివరించింది. టీటీడీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే.. టీటీడీ ఉద్యోగుల‌పైనే న‌టి అర్చనా గౌత‌మ్ దాడి చేసిందట. ఆమె దాడి హేయ‌మైన చ‌ర్య అంటూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అర్చనా గౌతమ్‌.. అవాస్తవ ఆరోప‌ణ‌ల‌తో ఉద్యోగుల‌పైనే త‌ప్పుడు ఫిర్యాదు చేశార‌ని టీటీడీ వివరణ ఇచ్చింది. అసలేమైందో టీటీడీ వివరించింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన  శివ‌కాంత్ తివారి, న‌టి అర్చనా గౌత‌మ్‌తోపాటు మ‌రో ఏడుగురికి ఆగ‌స్టు 31న తిరుమలేశుని ద‌ర్శనం కోసం కేంద్ర స‌హాయమంత్రి నుంచి సిఫార‌సు లేఖ‌ను తీసుకుని తిరుమ‌ల‌ వచ్చారట. అడిషన్ ఈవో ఆఫీసులో ద‌ర్శనం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారట. ఈ లేఖపై రూ.300/- ద‌ర్శనం టికెట్లు మంజూరు చేస్తూ  శివ‌కాంత్ తివారీకి చెందిన మొబైల్ నంబ‌రుకు టీటీడీ సిబ్బంది మెసేజ్ పంపారట. అయితే వారు దాన్ని వాడుకోలేదు. ఆ తర్వాత శివ‌కాంత్ తివారి అద‌న‌పు ఈవో కార్యాల‌యానికి వెళ్లారట. అయితే.. అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గ‌డువు ముగిసిందట.

ఆ విషయం చెబితే.. శివ‌కాంత్ తివారితోపాటు అడిషనల్‌ ఈవో కార్యాల‌యంలోకి చొచ్చుకుని వ‌చ్చిన న‌టి అర్చనా గౌత‌మ్.. తమ సిబ్బందిని దుర్భాష‌లాడారని టీటీడీ చెబుతోంది. అంతేకాదు..  స‌ర్ది చెప్పబోయిన ఒక టీటీడీ ఉద్యోగిపై అర్చనా గౌతమ్ చేయి కూడా చేసుకున్నారట. తివారి ఆ రచ్చ చూస్తూ ఉరుకున్నారు త‌ప్ప ఆమెను వారించలేదట. చివ‌ర‌కు అడిషనల్ ఈవో సిబ్బంది రెండోసారి రూ.300/- టికెట్లు కేటాయించినా అర్చనా గౌత‌మ్ తీసుకోలేదట. సీసీ ఫుటేజీలో అర్చనా గౌతమ్ రచ్చ అంతా రికార్డయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: