ఏపీలో కమ్మలపై దుష్ప్రచారం జరుగుతోందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గంపై మూడేళ్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో కాకతీయ సేవా సమాఖ్య నిర్వహించిన కమ్మ కులస్తుల సమావేశంలో ఆ కుల నేతలు ఈ విధంగా అభిప్రాయపడ్డారు. మౌర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశానికి నాలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పాటు ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు.

కమ్మ కులం ఏ రాజకీయ పార్టీకి, ఏ ఇతర సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదని.. కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అంటున్నారు. కానీ హిందూపురం ఎంపీ ఒంటి పై నూలుపోగు లేకుండా వీడియోలో కనిపించి..  దానికి కమ్మ కులస్తులను విమర్శించడం ఏమిటని బెజవాడ వెంకట్రావు ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గం తరపున సమాజానికి ఉపయోగపడే పనులు ఎన్నో మేం చేస్తున్నామని బెజవాడ వెంకట్రావు వివరించారు.

గోరంట్ల మాధవ్ వీడియోలకు తమ కమ్మ కులానికి సంబంధం లేదని బెజవాడ వెంకట్రావు అన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ అయితే దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని బెజవాడ వెంకట్రావు ప్రశ్నించారు. గాంధీ మాదిరాగా ఒక చెంప పై కొడితే మరో చెంప చూపించే పరిస్థితి లేదని... రెండు చెంపలు పగులగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బెజవాడ వెంకట్రావు వార్నింగ్ ఇచ్చారు. కొన్ని శతాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం వారు ప్రజల కోసం, సమాజం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని బెజవాడ వెంకట్రావు అంటున్నారు.

పార్లమెంటుకు మంచి వక్తల్ని పంపించాలి గాని... ఇలా అన్ పార్లెమెంటరీ పదాలు మాట్లాడే వారిని కాదని బెజవాడ వెంకట్రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా కులం పేరుతో మాట్లాడుతున్నారని ఈ సమావేశంలో కొందరు కమ్మ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా కమ్మ వారిపై నెపం మోపి... సమాజం నుంచి కమ్మ కులాన్మి వేరు చేసే కుట్ర జరుగుతోందని కమ్మ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల్ని కమ్మ కులానికి చెందిన నేతలు మౌనంగా చూస్తున్నారని.. వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామని బెజవాడ వెంకట్రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: