ఆ కొటేషన్‌ చదివితే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది!

75 ఏళ్ల క్రితం సంపాదించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది మన దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యమే. అలాంటి సైనికుల త్యాగం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతోంది. అలాగే సైనికులు కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తారు. అలాంటి సైన్యానికి సంబంధించిన కొన్ని కొటేషన్లు, సైనికుల మాటలు వింటే దేశ భక్తితో ఒళ్లు పులకరిస్తుంది. పరమ్ వీర్ చక్ర పొందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా ఏమంటారంటే.. యుద్ధానికి వెళ్లినప్పుడు నేనుతప్పకుండా వస్తాను .. జండా ఎగరవేసి అయినా వస్తాను.. లేదా ఆ జండాలో చుట్టబడి అయినా వస్తాను.. అబ్బా. ఎంత గొప్పభావమో కదా.

అలాగే లఢక్ లేహ్ హైవేపై ఓ సైనిక బోర్డుపై ఇలా రాసి ఉంటుంది. మీ జీవితంలో ఒక సాహసకృత్యం మాకు నిత్యకృత్యం. నిజమే కదా. పరమ్ వీర్ చక్ర పొందిన 1/11 గూర్ఖా రైఫిల్స్ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే ఏమంటారంటే.. చావు నా ముందుకు వస్తే, దాని చావు అది కోరి తెచ్చుకున్నట్లే ..అదీ ఓ సైనికుడి పౌరుషం అంటే.. అలాగే మన ఇండియన్ ఆర్మీ ఏమంటుందో తెలుసా.. మన జండా గాలికి ఎగరదు. దానిని కాపాడే 'సైనికుల' ఊపిరికి ఎగురుతుందని..

మరో సింహగర్జన కూడా చేస్తుంది.. మమ్మల్ని చూడాలనుకో, మంచిదే. పట్టుకోవాలనుకో, చాలా వేగం ఉండాలి. కానీ మమ్మల్ని ఓడించాలనుకుంటే 'అంతకంటే జోక్ మరొకటి ఉండదని హెచ్చరిస్తుంది.. ఇండియన్ ఆర్మీ. అలాగే.. మా శత్రువుల మీద భగవంతుడి దయ ఉండాలని కోరుకుంటాం..  మా కంట పడకుండా ఉండాలని.. ఎందుకంటే ఎదుట పడితే మాకు దయాదాక్షిణ్యాలు ఉండవని ఇండియన్ ఆర్మీ తెగేసి చెబుతోంది.

చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మరో కొటేషన్ ఏంటో తెలుసా.. మేము బ్రతికి ఉండటం అనేది ఒక ఛాన్స్. మమ్మల్ని అభిమానించడం అనేది మీ ఛాయిస్. కానీ శత్రువుని చంపడం మా ప్రొఫెషన్.. వారెవా.. టెర్రరిస్టులపై దయ చూపడం దేవుడి డ్యూటీ...  మా డ్యూటీ మాత్రం వారిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చెయ్యడమేనంటోంది ఇండియన్ ఆర్మీ. ఆర్మీ ఆఫీసర్ ప్రేమ్ రాంచందాని ఏమంటారంటే.. దేశం కోసం నాకు ఒకటే జీవితం ఇచ్చినందుకు బాధగా ఉందని.. అదీ సైనికుడి త్యాగ నిరత. జై జవాన్‌.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: