వండర్‌ఫుల్‌.. ఆ విషయంలో ఇండియా అదుర్స్?

ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉందని చెప్పాలంటే.. కొన్ని కొలతలు అవసరం.. అలాంటి వాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒకటి.. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశం ముందుంటే.. ఆర్థికంగా బలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు.. ఈ విషయంలో మరోసారి ఇండియా సత్తా చాటింది. 2021లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఇండియా ప్రపంచంలోనే టాప్‌-10లో నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌ 7వ స్థానంలో నిలిచింది.

ఐక్య రాజ్య సమితి తాజాగా వెల్లడించిన నివేదికలో ఈ విషయం తేలింది. మరి ఇండియా ఏడో ప్లేస్‌లో ఉంటే.. టాప్ ప్లేసుల్లో ఎవరున్నారు అంటారా.. అదీ చూద్దాం.. ఎప్పటిలాగానే ఈ విషయంలో అమెరికా నెంబర్ వన్‌ గా నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానాన్ని చైనా నిలబెట్టుకుంది. ఆ తర్వాత స్థానాల్లో  హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, కెనడా, బ్రెజిల్‌ ఉన్నాయి. ఈ ఆరు దేశాలు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఇండియా కంటే ముందున్నాయి.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానంలో ఇండియా ఉంటే.. మిగిలిన 8, 9, 10 స్థానాల్లో దక్షిణాఫ్రికా, రష్యా, మెక్సికో నిలిచాయి. ఇక లెక్కల్లో చూడాలంటే.. 2021లో భారత్‌ 45 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందట. అయితే.. 2020తో పోలిస్తే ఇది 19 బిలియన్‌ డాలర్లు తక్కువేయయ అయినా ఇండియా టాప్‌ టెన్‌ రేసులో నిలిచింది. ఇక 2020లో భారత్‌కు 64 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడులు వచ్చాయని నివేదక చెబుతోంది.

ఇక ప్రపంచం మొత్తం లెక్కలు వేసకుుంటే.. 2021లో ప్రపంచ వ్యాప్తంగా 1.6 ట్రిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడులు వెల్లువెత్తాయని ఈ ఐక్య రాజ్య సమితి నివేదిక చెబుతోంది. అయితే.. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనా ఇండియా ప్రపంచంలోనే టాప్ టెన్‌ ప్లేసులో నిలవడం మన దేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు. గతేడాది అంటే.. 2020తో పోలిస్తే భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గినప్పటికీ టాప్‌-10లోనే ఇండియా కొనసాగడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: